అంబానీకి కూడా ఈ జియో ‘ఆఫర్’ తెలియదనుకుంటా!

First Published Mar 31, 2017, 11:25 AM IST
Highlights

జియో ఫ్రీ ఆఫర్ పై నెటిజన్ల అద్భుత నివాళి

రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలోనే ఓ సంచలనం.

 

టెలికాంలోకి అడుగుపెట్టిన రోజు నుంచే రికార్డులు సృష్టించింది. ఉచితంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫ్రీ డేటాతో అదరగొట్టింది. మూడంటే మూడునెలల్లోనే దాదాపు 10 కోట్ల కస్టమర్లను ఆకట్టుకుంది.

 

మొదటగా లాంచింగ్ ఆఫర్ తో మూడునెలల పాటు ఉచితంగా కాల్స్, డేటా అందించిన జియో ఆ తర్వాత హ్యాపీ న్యూయర్ ఆఫర్ తో మరో మూడు నెలల పాటు అదే విధమైన సదుపాయం కల్పించింది.

 

ఈ ఆఫర్ స్వయంగా అంబానీనే ప్రకటించాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది. అయితే ఆయనకి తెలియన ఓ జియో ఆఫర్ ను నెటిజన్లు కనిపెట్టారు. అందుకే జియోకు ఫిదా అయిపోయి యూట్యూబ్ సాక్షిగా అభిమానం చాటుతున్నారు. వాట్సాప్ లో జియో మేలును కొనియాడుతున్నారు. ఫేస్ బుక్ లో ప్రశంసిస్తున్నారు.

 

ఇంతకీ నెటిజన్లు కనిపెట్టిన ఆ జియో ఆఫర్ ఎంటంటే ...

 

కష్టకాలంలో భారత ప్రజలను జియో ఆదుకుందట. ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో, నెలాఖరులో , కష్టకాలంలో ఫ్రీ నెట్ ద్వారా తమకు జియో ఎనలేని సేవ చేసిందని నోటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

జియో ఫ్రీ ఆఫర్ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఇన్నాళ్లు ఫ్రీ వాయిస్ కాల్స్, 4 జీ ఫ్రీ డేటా ఇచ్చిన జియోకు కస్టమర్లు తమదైన రీతిలో కృతజ్జతలు తెలుపుతున్నారు.

కొందరు నెటిజన్లు అయితే జియో మీద తమకున్న అభిమానాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో కూడా పెట్టేశారు.

మరికొందరు ఇలా కొన్ని మెసెజ్ లు వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ జియో పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

                                                           శ్రద్ధాంజలి

నా jio సిమ్ పని అయిపోయింది...
జ : 20-11-2016 
మ : 31-03-2017

అంతిమయాత్ర....
తేధి : 01-04-2017 
సమయం : ఉ.10 గం.లకు 
స్దలం : మా ఇంటి దగ్గర్లో ఉన్న చెత్త కుప్పలో.....
4 నెలలు ఉచిత సేవలు అందించిన jio మహరాజ్ కి జై......

 

నోట్ల రద్దు సమయంలో, నెలాఖరులో , కష్టకాలంలో ఫ్రీ నెట్ ద్వారా ఆదుకున్నందుకు ధన్యవాదాలు.....
మళ్లీ జన్మంటూ ఉంటే నువ్వు మళ్లీ jio సిమ్ గా పుట్టి, మళ్లి నా మొబైల్ లో చేరి 10 ఏళ్లు ఉచిత సేవలు అందించాలని ఆశిస్తూ....
గుడ్ బై  jio .......

 

 

click me!