
చైనాలో ఆమీర్ ఖాన్ దంగల్ కలెక్షన్ ల సునామీ సృష్టించింది. నిన్న రికార్డుస్థాయిలో 9వేల స్క్రీన్ లకు విడుదల యిన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ తెలుసా, రు. 15 కోట్లు.బాక్సాఫీస్ ఇండియా సమాచారం ప్రకారం, చైనాలో $2.1 మిలియన్లు వసూలుచేసి దుమ్మురేపింది. ఆమీర్ ఖాన్ చైనా లో ఎపుడూ సక్సెసే. గతంల ఆయన నటించిన పికె 4000 స్క్రీన్ లకు రిలీజయి రు. 100 కోట్లు వసూలు చేసింది.
అయితే, సినిమా అబ్జర్వర్ తరణ్ అదర్శ చైనా బాక్సాఫీస్ దగ్గిర దంగల్ నెంబర్ 2 అని పేర్కొన్నారు.
బాహుబలి 2, ది కంక్లూజన్ బాక్సాఫీస్ తలకిందలుచేస్తున్నపుడు దంగల్ ను ధైర్యంగా చైనాలో రిలీజ్ చేశారు. అయినా దంగల్ సుడిగాలి ఆగలేదు. ఆమీర్ ఖాన్ కు చైనాలో అభిమానులు కోకొల్లలు.
చైనా తో సమస్య ఏమిటంటే, సినిమా ప్రొడ్యూసర్స్ కి చైనానుంచి పెద్ద రాబడి ఉండదు. ఎందుకంటే, సినిమా చైనా డిస్ట్రిబ్యూర్లు కొనేస్తారు. ఇక పూర్తి హక్కులు వాళ్లవే. వాళ్లే చైనాలో సినిమా రిలీజ్ చేస్తారు.