నిర్భయ నిందితులకు ఉరి

First Published May 5, 2017, 9:33 AM IST
Highlights

దాదాపు 5 ఏళ్లుగా సాగిన ఈ విచారణలో కింది కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఏకీభవవించిన సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష  విధిస్తూ తీర్పువెలువరించింది.

ఆలస్యంగానైనా న్యాయం జరిగింది. నిర్భయ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడింది.దాదాపు 5 ఏళ్లుగా సాగిన ఈ విచారణలో కింది కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఏకీభవవించిన సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష  విధిస్తూ తీర్పువెలువరించింది.

 

దేశరాజధాని ఢిల్లీలో ఓ బస్సులో వెళుతున్న యువతిపై  2012 డిసెంబర్‌ 16న రాత్రి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలకు విదేశాల్లో వైద్యం ఇప్పించిన ఫలితం లేకుండా పోయింది.

 

ఈ దారుణానికి పాల్పడిన వారిలో రాంసింగ్ విచారణ జరుగుతున్న సమయంలోనే జైల్లో ఉరేసుకొని మృతిచెందాడు.మరొకరు మైనర్ కావడంతో ఇటీవలే విడుదల చేశారు.

 

మిగిలిన నలుగురు తమకు పడిన శిక్షను సవాలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన అనంతరం దోషులు ముఖేశ్‌, వినయ్‌, అక్షయ్‌, పవన్‌లు చేసిన నేరానికి ఉరి శిక్ష సరైందేనని సుప్రీం కోర్టు పేర్కొంది.

 

జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను విధిస్తూ ఈ రోజు తీర్పు వెలువరించింది.నిందితులకు ఉరిశిక్ష విధించడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

click me!