పాక్ లో అంతే మరి... సైన్యాన్ని తిట్టాడని ప్రధానిపై కేసు

First Published 5, May 2017, 11:27 AM IST
Highlights

రావ‌ల్పిండి సివిల్ లైన్ పోలీస్‌స్టేష‌న్‌లో ఇష్తియాక్ అహ్మ‌ద్ మీర్జా అనే లాయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

ఆ దేశంలో అంతే మరి... ప్రధాని కంటే ఆర్మీకి అక్కడ ఎక్కువ పవర్. అందుకే పేరుకు ప్రధానమంత్రులు పెత్తనం చెలాయిస్తున్నట్లు కనిపిస్తున్నా అదంతా ఊపర్ షెర్వానీ అందర్ పరేషాని టైపే.

 

అసలు పవర్ అంతా ఆర్మీ చేతులోనే ఉంటుంది. ఏ ప్రధాని అయినా  తోక జాడిస్తే అంతే సంగతలు.

 

ఇప్పటికే అర్థమై ఉంటుంది అది మన దాయాది దేశం పాకిస్తాన్ అని. ఇప్పుడు ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు.

 

ఆయన  మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏంటంటే.. దేశ ఆర్మీ పై తన అభిప్రాయాలను వెల్లడించడం.

 

ఆర్మీని ద్వేషించేలా, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ష‌రీఫ్ ప్ర‌సంగించార‌ని పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.

 

రావ‌ల్పిండి సివిల్ లైన్ పోలీస్‌స్టేష‌న్‌లో ఇష్తియాక్ అహ్మ‌ద్ మీర్జా అనే లాయర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

 

పాక్ సైన్యానికి వ్య‌తిరేకంగా న‌వాజ్ ష‌రీఫ్ మాట్లాడుతున్న వీడియో త‌న‌కు వాట్సాప్‌లో వ‌చ్చింద‌ని దాన్ని ఆధారంగా చూపిస్తూ ఆ లాయర్  ఫిర్యాదు చేశాడట.

 

Last Updated 25, Mar 2018, 11:54 PM IST