
రోడ్డు కుంగిపోయి ఒక బస్సు, కారును బలితీసుకున్నసంఘటన జరిగి రెండు రోజులు కాలేదు, తమిళనాడు రాజధాని చెన్నైలో కీలకమయిన అణ్నా సాలై రోడ్డు నెర్రెలీనింది. ఇది తీవ్ర భయాందోళనలకు కారణమయింది. ఎందుకంటే, రెండ్రోజుల కిందటే ఇదే రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. ఫలితంగా ఏర్పడిన గోతిలోకి ఓ బస్సు, కారు పడిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా రహదారి అణ్నా సాలై లో మరొక చోట రోడ్డు పై పగులు ఏర్పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఇటీవల గుంత పడిన రోడ్డుకు సమీపంలోనే అన్నాసాలై వద్ద సుమారు 10 మీటర్ల మేర నెర్రెలు ఏర్పడ్డాయి. దీనితో ఆ ప్రాంతంలోకి వాహనాలు రాకుండా అధికారుల చర్యలు తీసుకున్నారు. నెర్రెలను కారణాలనుకనుగొనేందుకు మునిసిపల్ అధికారులు ఆప్రాంతంలోడ్రిల్లింగఓ చేస్తున్నారు.
మెట్రో నిర్మాణ పనుల వల్లే రహదారులు కుంగిపోతున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు.
ఆదివారం నాడు ఇదే రోడ్డు కుంగి పోయిన ఏర్పడిన గుంతలో బస్సు పడిపోయినపుడు ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచితప్పించుకున్నారు.
అపుడు పెద్ద క్రేన్లు, ట్రక్కుల సహాయంతో గుంతలో పడిన బస్సును, కారును బయటకు తీశారు. భూగర్భంలో మెట్రో నిర్మాణ పనుల వల్లే ఇలా జరుగుతున్కనదని రాష్ట్ర ఆర్థిక మంత్రి డి. జయకుమార్ చెప్పారు. సమస్యను త్వరలోనే పరిష్కరించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్రిల్లింగ్ వల్ల మట్టి వదులై ఉంటుందని మెట్రో నిర్మాణ అధికారులు చెబుతున్నారు.