ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు బంద్... ఎందుకంటే..

Published : Apr 10, 2017, 01:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు బంద్... ఎందుకంటే..

సారాంశం

రోజుకు 8 గంటలే పెట్రోల్ బంక్ లు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.

పెట్రోల్ డీలర్లు ఆందోళన, కేంద్రం కప్పదాటు వైఖరి చివరకు వాహనదారుడికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.  తమ కమిషన్ పెంచాలంటూ గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రో డీలర్లు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

 

అయితే కేంద్రం వీరి డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.దీంతో పెట్రో డీలర్లు కొత్త రూపంలో తమ నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

 

మే 10వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు మూసివేయాలని నిర్ణయించారు. అంతే కాదు ఇకపై రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే బంక్ లు తెరిచి ఉంచాలని ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బంక్ లు తెరవరాదని డిసైడ్ అయ్యారు.

 

మే 10 లోపు కేంద్రం కమిషన్ పెంపు విషయంపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని లేకుంటే సండే రోజు పెట్రోల్ బంక్ ల మూత తప్పదని హెచ్చరించారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !