రఘురామ్ రాజన్ పుసక్తం మోదీ చవివితే... అంతే సంగతులు

First Published Sep 16, 2017, 11:59 AM IST
Highlights

‘‘మూడేళ్ళ మోడీ బండారాలు" పుస్తకాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విజయవాడలో ఆవిష్కరించారు.

 

 

‘‘మూడేళ్ళ మోడీ బండారాలు" అనే పుస్తకాన్ని  ఈ రోజు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విజయవాడలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోడీ మాటలకు పాలనకు ఎలాంటి పొంతనలేదని నారాయణ అన్నారు.

మోడీ ఓ మేక వన్నిన పులిలాంటివాడని ఆయన వర్ణించారు.

ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటంలేదుని అంటూ ఆర్ధిక నేరగాళ్ల పేర్లు కూడా బయటపెట్టలేని స్థితిలో దేశ ప్రధాని ఉన్నాడని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నారాయణ చెప్పిన మరికొన్ని విశేషాలు

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. రైతుల పేర్లు మాత్రం నోటీసు బోర్డుల్లో వేస్తున్నారు..

మాజీ  రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ కార్పొరేట్ శక్తుల గురించి రాసిన బుక్ ని మోడీ చదివితే ఆత్మహత్య చేసుకోవాలి..

దేశంలో మతాల పరంగా ఉన్న సెంటిమెంట్స్ ని మాత్రం రాజకీయంగా మోడీ బాగా వాడుకుంటున్నాడు..

నోట్ల రద్దుతో బ్లాక్ మనీ అంతా వైట్ మనీ అయిపోయింది...

నోట్ల రద్దుతో సాధించిందేంటి.. సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే..

టెర్రరిస్టులను అపలేకపోయాడు.. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అపలేకపోయాడు.. డ్రగ్ మాఫియాని అపలేకపోయాడు..

కార్పొరేట్ శక్తుల నల్ల ధనాన్ని వైట్ చెయ్యడానికే నోట్ల రద్దు చేశారు...

జిఎస్  టి వల్ల ప్రజలకు వొరిగిందేంటి.. అన్ని వస్తువుల పైన అధిక పన్నులు వేసి రేట్లు పెంచేశారు..

అవినీతి కాంగ్రెస్ పాలనలోనే దేశ ఆర్ధిక వృద్ధి రేటు రెండంకెల వండేది.. కానీ మోడీ పాలనలో 5 శాతాన్ని పడిపోయింది..

మోడీ,కేసీఆర్, చంద్రబాబు బాబాలను పట్టుకుని తిరుగుతున్నారు..

వాళ్లపై వాళ్లకు నమ్మకం లేదుకనుకే.. బాబాల కాళ్లు పట్టుకుంటున్నారు..

రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం పెరిగిపోయింది.. అది మంచిదికాదు..

రాష్ట్రాలను సహాయం చెయ్యకపోయినా కేసీఆర్, చంద్రబాబులు మోదీ జపం చేస్తున్నారు..

click me!