
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశమంతా నోట్ల గురించే మాట్లాడుకుంటుంది. కరెన్సీ కథలు ఒక్కోటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
పెద్ద నోట్ల ముద్రణ కు సంబంధించి నీముచ్‌కి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్ టి ఐ కింద ఆర్ బి ఐ కి కొన్ని ప్రశ్నలు సంధించాడు.
ఆర్ బి ఐ దీనికి ఇచ్చిన సమాధానాలు చూశాక.. నోట్ల ముద్రణ కు సంబంధించి చాలా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
దేశంలో కొత్త గా విడుదల చేసిన రూ. 500 లకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. కేవలం రూ. 3.90 పైసలేనట.
ఇక కొత్తగా వచ్చిన రూ. 2 వేల నోటుకు అయ్యే ఖర్చు రూ. 3. 54 పైసలు.
భారతీయ రిజర్వు బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైయివేట్ లిమిటెడ్(బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్) ఈ నోట్లను ముద్రిస్తోంది. ఇది ఆర్ బి ఐ కి అనుబంధంగా పనిచేస్తుంది.