
తళైవా రజనీకాంత్ కు ఆయన డ్రైవర్లు గట్టి షాక్ ఇచ్చారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని ధర్నాకు దిగారు.
తన సినిమాలు ప్లాప్ అయి డిస్టిబ్యూటర్లు నష్టపోతే తన సొంత డబ్బులను ఇచ్చే సూపర్ స్టార్ ఇలా తన ఉద్యోగులకు జీతాల విషయంలో ప్రవర్తిస్తారా అంటే నిజంగా నమ్మలేం.
కానీ, పెద్ద నోట్ల రద్దు ప్రభావం రజనీకాంత్ పై కూడా పడింది.
రజనీకాంత్ భార్య లత చెన్నైలోని స్వచ్ఛంద పాఠశాలను నడుపుతున్నారు. ఆ పాఠశాల బస్సులకు చాలా మంది డ్రైవర్లు ఉన్నారు.
ప్రతి నెలా ఒకటోతేదీ లోపే జీతాలు వచ్చేవి. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు వారికి జీతాలు అందలేదట. దీంతో చేసేది లేక ఆ డ్రైవర్లు అందరూ ఇలా ధర్నాకు దిగారు.
పెద్ద నోట్ల రద్దు, బ్యాంకులకు వరుస సెలిగలు, వర్దా తుఫాను తదితర కారణాల వల్లే జీతాలు టైం కు అందలేదని మేనేజ్ మెంట్ వివరణ ఇచ్చింది.