ఆర్ బి ఐ గవర్నర్ మోదీనా ఉర్జితా ?

First Published Dec 21, 2016, 12:34 PM IST
Highlights

కేంద్రానికి హిందూమహాసభ ప్రశ్న

 

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల బీజేపీ .. ప్రతిపక్ష పార్టీల నుంచే కాదు.. తన మద్దతుదారుల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటుంది.

 

నిన్నగాకమొన్న కేంద్రం నిర్ణయంపై ఆర్ ఎస్ ఎస్ విరుచకపడిన విషయం తెలిసిందే.

 

ఇప్పుడు తాజాగా  హిందూ మహాసభ కూడా అదే దారిలో కేంద్రం నిర్ణయంపై విమర్శలు ఎక్కుపెట్టింది.


పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం రోజుకో నిర్ణయం ప్రకటిస్తూ వెంటనే దాన్ని వెనక్కు తీసుకుంటుందని అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధి దంతు నాగార్జున శర్మ విమర్శించారు.

 

కేంద్రం తొందరపాటు నిర్ణయాల వల్ల సామాన్య ప్రజానీకం అయోమయానికి గురవుతోందని ధ్వజమెత్తారు.

 

బీజేపీ ప్రభుత్వం, ఆర్ బి ఐ లు రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నారని  ఆరోపించారు.

 

రేపు కొత్తగా పెద్ద నోట్ల రద్దుపై ఎలాంటి వార్త వస్తుందోనని ప్రజలు బయపడిపోతున్నారని పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి అధికార ప్రతినిధిలాగా ఆర్ బి ఐ గవర్నర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.

 

ప్రభుత్వమంటే ప్రధాని ఒక్కరేనా దేశ ప్రజలందారా అనే అనుమానం కలుగుతోందన్నారు.

 

ఇంతకీ ఆర్ బి ఐ గవర్నర్ మోదీనా ఊర్జిత్ పటేలా అనే విషయం కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.

 

తుగ్లక్ పాలనను తలిపించేలా కేంద్రం నిర్ణయం ఉందని ప్రజలు భావిస్తున్నారని మండిపడ్డారు. 

click me!