దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసును తోసిపుచ్చిన వెంకయ్య

First Published Apr 23, 2018, 10:41 AM IST
Highlights

దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసును తోసిపుచ్చిన వెంకయ్య

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. హైదరాబాదు పర్యటనకు వెళ్లిన వెంకయ్య నాయుడు ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు.

అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి, సుభాష్ కశ్యప్, మాజీ లా సెక్రటరీ పికె మల్హోత్రా, సంజయ్ సింగ్ తదితరులతో వెంకయ్య నాయుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. 

తాము ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఇచ్చిన అభిశంసన నోటీసును పరిగణనలోకి తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెసు నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

అభిశంసన నోటీసుపై ఏడు పార్టీలకు చెందిన 71 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేశారు. ఆ నోటీసును శుక్రవారం వెంకయ్య నాయుడికి సమర్పించారు. దానిపై సంతకాలు చేసినవారిలో ఏడుగురి పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. అయితే, నోటీసుపై చర్చను చేపట్టడానికి 50 మంది సంతకాలు సరిపోతాయి.  
click me!