23 ఏప్రిల్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

Published : Apr 23, 2018, 09:26 AM IST
23 ఏప్రిల్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

సారాంశం

శుభపరిణామాలుంటాయి.

మేషం

మేషం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభం : ఈ రోజు మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

మిథునం

మిథునం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటి లో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

సింహం

సింహం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

కన్య

కన్య : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

తుల

తుల : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పైఅధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈ రోజు వ్యాపార లావాదేవీలు కానీ, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వివాహ విషయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఉద్యోగ విషయంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వివాదాలు పరిష్కరించ బడతాయి.

కుంభం

కుంభం : ఈ రోజు వృత్తి విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మీ సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. నరాలు, మెడకు సంబంధించిన అనారోగ్యంతో బాధ పడే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మీనం

మీనం : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో కాని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంటుంది. దాని కారణంగా మానసికంగా ఆందోళనకు లోనవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu