
తెలంగాణలో సరికొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడ బోతున్నది. టిఆర్ ఎస్ ప్రభుత్వం విధానాల వల్ల నిరాశ చెందిన వారు, తెలంగాణా జెఎసి, జెఎసి బయట ఉన్న ప్రజాసంఘాలతో పాటు, గతంలో తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న లాయర్లు, గత తెలంగాణా ఉద్యమానికి ఐటి నీడనిచ్చిన తెలంగాణా డెవెలప్ మెంటు ఫోరం నాయకులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు ఈ పార్టీలో చేరనున్నారు. ప్రజసంఘాల మధ చర్యలు మొదలయ్యాయి.కోదండ్ రామ్ తో సహ అన్ని ప్రజాసంఘాలు వారు, తమ సంఘాలను రద్దు చేసుకుని కొత్త పార్టీలో చేరతారని, ఇపుడు దీనికి భూమిక తయారు చేస్తున్నామని కొంతమంది విజ్ఞులు చెప్పారు.
అయితే, ఏ ప్రాతిపదికన ఈ సంఘాలనేతలను దగ్గరికి తీసుకురావాలనే దాని మీద ప్రస్తుతం తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో ఉన్న నాయకులందిస్తున్న సమాచారం ప్రకారం, తెలంగాణాలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకునే వారందరు కొత్త పార్టీలోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఒక ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ (సిఎంపి) రూపొందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పని కూడా మొదలయింది.
తెలంగాణా రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం చేయ లేక పోయిన కార్యక్ర మాలు, విస్మరించిన కార్యక్రమాలు, ఏ వర్గాలు ఏ ఆశయాలతో తెలంగాణ ఉద్య మానికి మద్దతుతెలిపాయి, ఆ ఆశయాలను అమలుచేసేందుకు తీసుకోవలసిన చర్యలను కామన్ మినిమిమ్ ప్రోగ్రాంలో పొందుపరుస్తారు. అన్ని ప్రజాసంఘాలు ఉమ్మడిగా పోరాటం చేయడంతోనే మల్ల న్న సాగర్ ఉద్య మం విజయవంతమయిందని చెబుతూ తొందర్లో ఏర్పడబోయే కొత్త పార్టీకి ఈమల్లన్నసాగర్ ఉద్యమమే స్ఫూర్తిగా ఉంటుందని సిఎంపి రచనలో నిమగ్నమయిన నాయకుడొకరు వెల్లడించారు.
‘ తెలంగాణా వచ్చింది. తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభతువం ఏర్పాటుచేసింది. తెలంగాణా నేత ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, రాష్ట్రంలో తెలంగాణా పాలన సాగడం లేదు. ఇంకా అంధ్రావాళ్ల పాలనే కొనసాగుతున్నది. పాలకవర్గం కూడ దానినే కొనసాగించేందుకు పూనుకుంది. దీనితో తెలంగాణాకాంట్రాక్టర్లు, విద్యాసంస్థలు వారు, లాయర్లు, డాక్టర్లు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతులు, చేనేత వారు, అట్టడుగు వర్గాల వారు తెలంగాణా వల్ల మనకేం వచ్చిందని అడుగుతున్నారు. వీళ్ల ఆశలు, ఆశయాలు ప్రతిబింబించేలా కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపొందుతున్నది,’ ఈ వర్గాలు తెలిపాయి.
నిరుద్యోగుల ర్యాలీ తర్వాత ప్రజాసంఘాల మధ్య సమన్వయం ఉపందుకుంటుందని చెబుతూ ఈ ఏడాది అఖరుకల్లా తమ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఒక స్వరూపం తీసుకుంటుందని ఈ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.