‘అమ్మ’కు గుండెపోటు

Published : Dec 04, 2016, 04:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
‘అమ్మ’కు గుండెపోటు

సారాంశం

తమిళనాడు సీఎం జయలలిత పరిస్థితి విషమం ఆందోళనలో అమ్మ అభిమానులు, కార్యకర్తలు

అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురయ్యారు. గతంలోనే ఆమె అనారోగ్యానికి గురికావడంతో కొన్ని నెలలుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

 

ఈ రోజు రాత్రి ఆమెకు సడెన్ గా గుండెపోటు వచ్చింది. దీంతో సాధారణ వార్డులో ఉన్న ఆమెను వెంటనే ఐసీయూ లోకి తరలించారు. ఢిల్లీలోని ఏయిమ్స్ కు చెందిన కార్డియాలజిస్టుల బృందం పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

 

గత సెప్టెంబరు 22వ తేదీన డీహైడ్రేషన్, తీవ్ర జ్వరం తదితరాల కారణంగా అపోలో ఆసుపత్రిలో జయ చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. లండన్‌కు చెందిన డాక్టర్‌ పీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు, సింగపూర్‌ ఫిజియో థెరపీ వైద్యులు ఇచ్చిన చికిత్స కారణంగా ఆమె కోలుకోవడంతో గత 19వ తేదీన ఐసీయూ నుంచి ఆమెకు సాధారణ వార్డుకు తరలిచారు.


అమ్మకు గుండెపోటు వచ్చిన విషయం బయటకు తెలియడంతో ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు మళ్లీ అపోలో ఆస్పత్రికి పోటెత్తారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !