నిరాదరణకు గురైన విజయవాడ తల్లిదండ్రుల ఆత్మహత్య

First Published Jul 11, 2017, 1:21 PM IST
Highlights

కన్న బిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు మనస్తాపం తో విజయవాడ కృష్ణ లంకకు చెందిన వృద్ధ దంపతులు  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.అనారోగ్యంతో ఉన్నపుడు కన్నబిడ్డలు తమను అదుకోలేదని కుమిలిపోయి వారి చర్యకు పాల్పడ్డారు.

కన్న బిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రులు మనస్తాపం తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయవాడ కృష్ణలంకలో జరిగింది.

కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్ లో నివాసం వుండే బొచ్చు సత్యనారాయణ(65), కనకదుర్గ (60)దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె వున్నారు. పెద్ద కుమారుడు చెన్నకేశవులు ఒంగోలు లో మెడికల్ వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ కృష్ణలంకలో హోంగార్డ్ గా పని చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో ఈవృద్ధ దంతులు బాధపడుతున్నారు.

ఇటీవలే చిన్న కుమారుడు కి మూడు లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు సమాచారం.  చిన్న కొడుకు దుర్గాప్రసాద్  మీ జబ్బులు మాకు అంటుకుంటాయి, ఇంటి నుంచి వెళ్ళి పోవాలంటూ తల్లిదండ్రుల ను వేధించడం మొదలుపెట్టాడు. తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తే వెళ్ళిపోతామన్న తల్లిదండ్రులను తన తోడల్లుడు, మామలను పిలిపించి మరీ వేధించినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో మనస్థాపంకు గురైన వృధ్ద దంపతులు తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోనే వురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటన గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నకొడుకు తో సహా బంధువులు పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!