ఐపీఎల్ బెట్టింగ్ అడ్డాగా హైదరాబాద్ బార్లు

Published : May 08, 2017, 10:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఐపీఎల్ బెట్టింగ్ అడ్డాగా  హైదరాబాద్ బార్లు

సారాంశం

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి సిటీ బార్లు ఎల్ ఈ డీ స్క్రీన్ లతో కుర్రకారును తమ వైపు ఆకర్షిస్తున్నాయి. బెట్టింగ్ కు అనుకూలంగా సెటప్ లు మారుస్తున్నాయి.దీంతో యూత్ అంతా బారులకు బారులు తీరుతున్నారు.

మందుబాబులకు తాగడానికి ఓ రీజెన్ కావాలి. మందు అమ్మే బాబులకు అమ్మడానికీ ఓ ఈవెండ్ కావాలి. ఆ రెండింటిని ఐపీఎల్ బాగా కలిపింది. ట్వింటీ 20 క్రికెట్ లో పరుగుల వరద పారుతుంటే... కుర్రకారు మత్తులో జోగుతోంది... బారు ఓనర్ల ఇంట సిరుల పంట పండుతోంది.

 

ట్వింటీ 20 క్రికెట్ తో దేశమంతా టీవీలకు అతుక్కపోతుంటే కుర్రకారు మాత్రం బార్ల ముందు బారులు తీరుతున్నారు. పీపాలకొద్దీ బీర్లు లాగిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

బార్లు ఓనర్లకు సిరులకురిపిస్తున్నారు.

 

ఎక్కడో ఐపీఎల్ ఆడితే హైదరాబాద్ బారు ఓనర్లకు ఏంటీ లాభం అనుకుంటున్నారా... చాలా లాభం ఉంది.

 

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి సిటీ బార్లు ఎల్ ఈ డీ స్క్రీన్ లతో కుర్రకారును తమ వైపు ఆకర్షిస్తున్నాయి. బెట్టింగ్ కు అనుకూలంగా సెటప్ లు మారుస్తున్నాయి.

దీంతో యూత్ అంతా బారులకు బారులు తీరుతున్నారు.

 

అక్కడ చల్లటి బీర్లు తాగుతూ ఐపీఎల్ చూస్తూ బెట్టింగ్ లకు దిగుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా వారి మామూళ్లు వారికి అందుతుండటంతో బారు బాగోతాలు బయటకు రావడం లేదు.

 

ఐపీఎల్ పుణ్యాన రోజుకు లక్ష రూపాయిల కౌంటర్ కూడా చేయని బార్లు ఇప్పుడు రోజుకు లక్ష రూపాయిల లాభాన్నే వెనకేసుకొస్తున్నాయి.

 

కొన్ని బార్లలో ఐపీఎల్ అయిపోయే సమయానికి దాదాపు 3 వేల బీర్లు అమ్ముడైపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ట్వింటీ 20 క్రికెట్ లిక్కర్ షాపులకు ఏ స్థాయి బంగారు కోడిపెట్టగా మారిందో తెలియడానికి.

 

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu