సామాన్యుడి ప్రేమలో రాకుమారి..

First Published Sep 4, 2017, 11:11 AM IST
Highlights
  • జపాన్ రాజకుమారి.. ఓ సాధారణ యువకుడిని ప్రేమించింది
  • త్వరలోనే వారు పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు..
  • అందుకు తన రాచరికాన్ని వదిలేసేందుకు కూడా ఆమె సిద్ధపడ్డారు.

 ‘కోటలోని రాణి పేట పోరగాన్ని పెళ్లి చేసుకుంటానంటావా.. పేదల బస్తీలోన కాపుర ముంటావా..’ ఈశ్వర్ సినిమాలోని ఈ పాట అందరికీ గుర్తుడే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ ని ఉద్దేశించి ఈ పాట ఉంటుంది. ఈ ఒక్క సినిమానే కాదు.. చాలా సినిమాల్లో.. తోట రాముడినే.. యువరాణి  ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఇలాంటివి మనం సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ.. నిజజీవితంలోనూ ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంది. జపాన్ రాజకుమారి.. ఓ సాధారణ యువకుడిని ప్రేమించింది.. త్వరలోనే వారు పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు..

 

వివరాల్లోకి వెళితే.. జపాన్ చక్రవర్తి అకిహితో.. మనవరాలు మాకో(25).. కీ కోమూర్(25) అనే ఓ సాధారణ యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ యూనివర్శిటీలో క్లాస్ మేట్స్. అలా అక్కడ ఏర్పడిన స్నేహం.. ప్రేమకు దారితీసింది. అయితే.. వీరి వివాహానికి రాజకుటుంబం కూడా అంగీకారం తెలిపింది. 2018లో వీరి వివాహాన్ని నిశ్చయించారు. కాగా.. త్వరలోనే నిశ్చితార్థం జరపనున్నారు.

 

జపాన్ రాచరిక వ్యవస్థ ప్రకారం.. వారి వంశానికి చెందిన పురుషులు.. సాధారణ కుటుంబానికి చెందిన మహిళలను వివాహమాడితే.. తమ రాజరికాన్ని వదులు కోవాల్సిన అవసరం ఉండదట. పైగా ఇంటి వచ్చే కోడళ్లకు కూడా రాజకుటుంబీకులైపోతారట. కానీ ఆడపిల్ల గనకు సాధారణ యువకుడిని వివాహమాడితే మాత్రం.. ఆమె తన రాచరికాన్ని వదిలేయాల్సి ఉంటుందట.

 

ఇప్పుడు రాజకుమారి మాకో కూడా తన రాజరికాన్ని వదిలేయాలి. కాకపోతే అందుకు ఆమె బాధపడటం లేదట పైగా.. తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. కీ కోమూర్ నవ్వంటే తనకు ఎంతో ఇష్టమని.. తన నవ్వు సూర్యుడి వెలుగువలే ప్రకాశవంతంగా ఉంటుంది.. దానికే పడిపోయానని మాకో తెలిపింది. అంతేకాకుండా.. తనకు కాబోయే భర్త హార్డ్ వర్కర్ అని, స్ట్రాంగ్ మైండ్, సిన్సియర్ అని చెబుతోంది ఈ రాకుమారి.

click me!