చిల్కూర్ భక్తుల కొత్త కోరిక

First Published Jul 17, 2017, 11:31 AM IST
Highlights
  • పూర్వం చిల్కూర్ వచ్చే వారు వీసా ఇప్పించండని దేవుడిని కోరే వారు
  • ఇపుడు వీసా కంటే ముందు ట్రంపు మనుసు మార్చాలని కోరుతున్నారు
  • అమెరికాలో ఉన్న టెకీల క్షేమం  కోరుతూ తల్లితండ్రులు కూడా చిల్కూర్ వస్తున్నారు

చిల్కూర్ బాలాజి టెంపుల్ సందర్శించే వారి సంఖ్య తగ్గలేదు .అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ పగబట్టి, వీసా నిబంధనలను బిగించినా, అనేక మంది టెకీలు అమెరికా వదలి ఇండియా ఇంటి బాట పట్టినా, చాలా కంపెనీలలో ఉద్యోగాలు పోతున్నా మన కుర్రకారు పడమటి దిక్కు చూడటం మానడం లేదు. ఇండియాలో ఉద్యోగాలు పెరగకపోవడం, ఉద్యోగాలనేవి ఎన్నికల నినాదం కావడంతో అమెరికా వైపు చూడకుండా వుండ లేకపోతున్నారు.  దీనితో చిల్కూర్ బాలాజీ మొక్కుబడి కూడా కాలాన్ని బట్టి మారిపోయింది.

పూర్వం వీసాల కోసం చిలుకూరు వచ్చేవారు. దీనితో ఇక్కడి స్వామి వీసా బాలాజీ అయిపోయాడు. ఇపుడు వీసా కష్టాలొచ్చినా, టెకీ భక్తులు చిలుకూరు సందర్శించడం మానడం లేదు. కాకపోతే,  డిమాండ్ మారింది.  ఇపుడొస్తున్న వారిలో చాలా మంది ట్రంప్ మనసుమార్చాలని కోరుకుంటున్నారు. ‘పరిస్థితులు  మారాలి. మళ్లీ మంచి రోజులు రావాలి, ట్రంపులో పరవర్తన రావాలి. మేము అమెరికా వెళ్లాలి,’అనేది ఇప్పటి ఒక తాజా ప్రార్థన.

ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని పైచదువుల పేరుతో అమెరికా వెళ్లలనుకే వారు, హెచ్ 1 బి వీసా కోరే వారి వరస ఇది.  చిలుకూరులో వీళ్ల సంఖ్య బాగా పెరిగింది. చిల్కూర్ బలాజీని ఇపుడు ఈ కొత్త రకం  భక్తులు కూడా ఎక్కువగా  సందర్శిస్తున్నారు. ఇలాంటి వారిలో ఇపుడు టెకీల తల్లితండ్రులు కూడా ఉన్నారు. ‘అబ్బాయి అమెరికా వెళ్లాక, పరిస్థితులు చక్కబడ్డాయి. ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. ఇపుడు అబ్బాయికి అక్కడ ఉద్యోగం పోయి, ఇంటికి తిరిగొస్తే, సంక్షోభం వస్తుంది. అందువల్ల ఈ కష్టాలు రానీయ వద్దు. ట్రంపు మనుసు మార్చు స్వామీ’అని కోరే తల్లితండ్రులు, అమెరికా లో పనిచేస్తున్న టెకీతో కూతురి పెళ్లి నిశ్చయం చేసుకున్న  వారి సంఖ్య పెరిగింది.

  టెంపుల్  ప్రధానార్చకుడు సిఎస్ గోపాలకృష్ణ కు  కూడా భక్తుల ఆందోళన, వారి కోరికలో వచ్చిన మార్పు అర్థమయింది. అందుకే ఆయన భక్తులమొర బాలాజీ ఆలకిస్తాడని,  ట్రంప్ లో పరివర్తన తీసుకువస్తాడని చెబుతున్నారు. ‘ ట్రంప్ అశాశ్వతం. వేంకటేశ్వర స్వామి శాశ్వతం. ఈ భక్తులు మొర స్వామిని చేరుతుంది. తప్పకుండా ట్రంపులో మార్పు వస్తుంది,’ అని ఆయన అంటున్నారు.

మొదటి ట్రిప్పలో 11 ప్రదక్షిణలు చేస్తున్నారు. వీసా వచ్చాకా 108 ప్రదక్షిణలు చేస్తామని కూడా వీరు  రెండో మొక్కుకు సిద్ధమవుతున్నారు.

ఇపుడు దాదాపు రోజూ 2 వేలమంది రోజు చిలుకూరు దేవుడిని సందర్శిస్తున్నారు. వీరిలో 80శాతం మంది అమెరికా వైపు చూస్తున్న వారే, ట్రంపులో మానసిన పరివర్తనకోరుతున్నవారే. వరంగల్ కు చెందిన మందడి యాదగిరి రెడ్డి (72) , భార యశోధ( 64)తో కలసి ఆదివారం నాడు చిల్కూర్ సందర్శించాడు. ఎందుకో తెలుసా... వాళ్లబ్బాయి, కోడలు అమెరికా ఇపుడు హ్యపీగా ఉంటున్నారు. వాళ్ల మీద ట్రంపు దెబ్బపడకూడదని. ట్రంపులో పరివర్తన రావాలని.దీనితో పాటు వాళ్లు దేవుడిని మరొక కోరిక కూడా కోరుకున్నారు. ఆదేశంలో తెలుగువాళ్ల మీద కాల్పలు జరగుతున్నాయి.అవికూడా ఆగిపోవాలని.

click me!