(video) చలపతిని చీల్చారు... బాలయ్యను మరిచారు

Published : May 24, 2017, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
(video) చలపతిని చీల్చారు... బాలయ్యను మరిచారు

సారాంశం

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అయితే ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

సీనియర్ నటుడు చలపతిరావు ఇటీవల ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. జాతీయ మీడియా కూడా ఈ విషయంపై అతడ్ని ఏకిపడేస్తుంది.

 

నోటిదూలతో చేసిన వ్యాఖ్యలు అతడి 50 ఏళ్ల సినిమా జీవితానికి పెద్ద మచ్చలా తయారయ్యాయి. సోషల్ మీడియా ఆయన వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోయడం, మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడటంతో ఎట్టకేలకకు చలపతిరావు దిగొచ్చారు. క్షమాపణలు చెప్పారు.

 

అయితే ఆయనపై ఇప్పటికే కొందరు మహిళా సంఘం నేతలు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ కింద ఆయనపై కేసు కూడా నమోదైంది.

 

ఇక ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అయితే ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

 

‘ మహిళా కమిషన్ తరఫున ఆడపిల్లలకు చాకులివ్వాల్సింటుంది, అలా ఓ చట్టం తీసుకొస్తాం. ఒళ్లు బలసిన వాళ్లు, పశువుల్లాగా, మృగాళ్లాగా ఏంటిదీ అంటూ చలపతిపై బాగానే ఫైర్ అయ్యారు.

 

ఇదంతా బాగానే ఉంది. చలపతి చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గు చేటు. అందరూ ఆయన వ్యాఖ్యలు ఖండించాల్సిందే. నన్నపనేని కూడా అదే చేశారు.

 

ఆయనొక్కరే కాదు గతంలోనూ చాలా మంది సినీ ప్రముఖులు ఇంతకంటే ఘాటుగానే మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ పైశాచికానందాన్ని ప్రదర్శించారు. అందులో ప్రథమంగా పేర్కొన్నాల్సింది సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి.

ఆయన కూడా గతంలో ఇలానే ఓ సినిమా వేడుకకు హాజరయ్యారు. చుట్టూ అభిమానుల కేరింతలు... ఇంకేముంది మైక్ అందుకొని రెచ్చిపోయారు.

 

నా అభిమానులు అమ్మాయిలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలంటూ తన ఫ్యాన్స్ కు గీతోపదేశం చేశారు. అప్పుడు కొందరు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. అంతటితో  ఆ దుమారం ఆగిపోయింది. అదేం విచిత్రమో కానీ, ఏ పోలీసు స్టేషన్ లోనూ ఆయనపై కేసు నమోదు కాలేదు.  ఏపీ ముఖ్యమంత్రి వియ్యంకుడు, ఓ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, అగ్రనటుడు అవడం వల్ల పోలీసులు కూడా భయపడ్డారా... మహిళా సంఘాలు కూడా మౌనంగా ఉండిపోయాయి... ఎందుకో తెలియదు అప్పుడైతే ఇంత స్పందనరాలేదు.

ఇక  ఈ రోజు చలపతిపై మండిపడిన నన్నపనేని ఆ రోజు మాత్రం మాటకూడా మాట్లాడినట్లు లేదు. ఎంతైనా ఒకే పార్టీ అని కామ్ గా ఉండిపోయారా..

చలపతికి ఒక న్యాయం... బాలకృష్ణకు ఒక న్యాయమా...?

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu