షాక్..ఆ బిడ్డ ఆమె బిడ్డ కాదట

First Published Mar 2, 2018, 4:08 PM IST
Highlights
  • మోడల్ జోసెఫ్ పై కోర్టులో కేసు వేసిన న్యాయవాది మాథ్యూస్

మళయాళం మ్యాగజైన గృహలక్ష్మి కవర్ పేజీపై మరో వివాదం తలెత్తింది. మ్యాగజైన్ కవర్ పేజీకి బిడ్డకు పాలు ఇస్తూ.. ఫోటోకి పోజు ఇచ్చిన మహిళకు అసలు పెళ్లే కాలేదట. ఒక పెళ్లి కాని అమ్మాయితో.. ఇలాంటి ఫోటో ఎలా తీస్తారంటూ..మాథ్యూస్ అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు..

అసలు విషయం ఏమిటంటే...  గృహలక్ష్మి మ్యాగజైన్ ఇటీవల తల్లి పాలు, తల్లి బిడ్డల అనుబంధం గురించి ఓ కవర్ పేజీ స్టోరీ రాసింది. ఈ నేపథ్యంలో.. మ్యాగజైన్ కవర్ పేజీ పై ఓ మహిళ( మోడల్ జోసెఫ్) బిడ్డకు పాలుస్తున్న ఫోటో వేశారు. కాగా… ఈ ఫోటోపై పలు మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే.. మోడల్ జోసఫ్ మాత్రం.. అది మాతృత్వానికి చిహ్నమని.. నగ్నత్వంగా ఎందుకు చూస్తారంటూ వారందరికీ కౌంటర్ వేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. అసలు ఆ మోడల్ కి పెళ్లి కాలేదట. దీనినే న్యాయవాది మాథ్యూస్ తీవ్రంగా పరిగణించారు.

ఒక పెళ్లి కాని అమ్మాయి.. ఓ పసిబిడ్డకు పాలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మ్యాగజైన్ ఎడిటర్, మోడల్ పై కేసు వేశారు. కాగా దీనిపై మ్యాగజైన్ స్పందించింది. ‘‘అందరి ముందు మహిళలు బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆలోచిస్తుంటారు. దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ స్టోరీ రాశాం. చాలా మంది తల్లులను బిడ్డకు పాలు ఇస్తూ ఫోటో దిగాలని అడిగితే అంగీకరించలేదు. చివరి ప్రయత్నంగా మోడల్ జోసెఫ్ అని అడగగా.. ఆమె అందుకు అంగీకరించారు’’ అని చెప్పారు.

 

click me!