సౌదీ మార్చురీలో దిక్కులేని శవమయిన జగిత్యాల కూలోడు

First Published Apr 25, 2017, 7:23 AM IST
Highlights

పొన్నం సత్యనారాయణ మార్చి 11, 2017 న చనిపోయాడు. ఆయన మృత దేహం రియాద్ లోని ఒక మార్చురీ లో ఉంది. ఇంటికి తెచ్చేందుకు  డబ్బుల్లేవు. ప్రభుత్వం కనికరిస్తే, మార్చురీ నుంచి  బయటపడతాడు. శవంగా నైనా ఇంటికొస్తాడు.

ఈ పోటోలో ఉన్నతను తెలంగాణాకు చెందిన పొన్నం సత్యానారాయణ. వయసు 48 సంవత్సరాలు. జగిత్యాలకు చెందిన పేద వాడు, కూలి వాడు. ఎన్నోకలలతో సౌదీ వెళ్లి, ఇపుడు ఇంట్లోఅందరికి కన్నీళ్లు మిగిలించాడు. ఎందుకంటే,  బతికుండగా పీడించిన కష్టాలు చనిపోయాక కూడా వదల్లేదు.

 

సత్యానారాయణ మార్చి 11, 2017 న చనిపోయాడు. ఆయన మృత దేహం రియాద్ లోకి ఒక మార్చురీ లో ఉంది. ఇంటికి తెచ్చేందుకు కుటుంబ సభ్యుల దగ్గిర డబ్బుల్లేవు. ప్రభుత్వం కనికరిస్తే, మార్చురీ బయటకొస్తాడు. శవంగా నైనా ఇంటికొస్తాడు.

 

వీసా రద్దు కావడం, మృతదేహాన్ని భారత దేశానికి తరలించేందుకు అయే భారీ ఖర్చు వల్ల చాలా మంది  భారతీయుల శవాలు మార్చురీలలో మగ్గుతుంటాయి. సత్యనారాయణ లాగే పంజాబ్ కు చెందిన జస్వింద్ సింగ్ మృతదేహం ఇదే మార్చురీలో ఉంది. కపుర్తాలకు చెందిన జస్విందర్ వయసు 56. ఆయన ఫిబ్రవరి 21 చనిపోయాడు.

 

సత్యానారాయణ, జస్విందర్ ఒకే కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వారు. ఈ శవాలను  భద్రపరిచేందుకు, గ్రామాలకు తరలిచేందుకు ఈకంపెనీ  ఇపుడు మనుగడలో లేదు.ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ నియమాలక ప్రకారం వీటిని స్వదేశాలకు తరలించాలంటే శవపేటిక, కెమికల్ ఎంబామింగ్ తప్పనిసరి.

 

‘ ఒక ఏడాదిగా జీతాలు లేకపోవడంతో మా పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇద్దరు మిత్రులు చనిపోవడం మమ్మల్నింకా కృంగదీస్తున్నది,’ అని ఇదే కంపెనీకి చెందిన వర్కర్లు ‘సౌదీ గెజిట్’  పత్రికకు తెలిపారు.

 

సత్యనారాయణ, జస్వంత్ పనిచేస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీ దివాళా తీసింది. దీనితో కార్మికుల మెడికల్ ఇన్స్యూ రెన్స్ ఖతమయింది. కంపెనీ ఇపుడు వీళ్లకు సంబంధించిన ఏ ఖర్చును భరించేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంతా వీరిద్దరి మృతదే హాలు నెలలుగా రియాద్ మార్చురీలో పడి ఉన్నాయి. కార్మికులు చనిపోయినపుడు , వారి మృతదేహాలను మాతృదేశాలకు పంపించే బాధ్యత కంపెనీలదే. ఈ కంపెనీ ఇపుడు మనుగడలో లేదు.    వీరిద్దరు సౌదీ లా దాదాపు రెండు దశబ్దాలుగా ఉంటున్నారు. ఇందులో ఎక్కవ కాలం నిరుద్యోగంలోనే మగ్గిపోయి ఉన్నారు.

 

 

click me!