70189820250 టోల్ ఫ్రీ నెంబర్ ఎవరిదో తెలుసా..

Published : Apr 24, 2017, 02:56 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
70189820250 టోల్ ఫ్రీ నెంబర్ ఎవరిదో తెలుసా..

సారాంశం

ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 132పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఐపీఎల్ లో హంగామా అంతా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)దే. కోహ్లీ, గేల్, డివిలీయర్స్ లాంటి విధ్వంసకర బ్యాట్స్ మెన్ లతో ఆ టీం క్రికెట్ ప్రేమికుల ఫేవరెట్ జట్టుగా స్థిరపడిపోయింది.

 

ఇక గేల్ విధ్వంసం గురించే  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఆర్ సీబీ టీం ఆడే మ్యాచ్ లకు అభిమానులు క్యూ కడుతున్నది అతడి సిక్స్ ల కోసమే.

 

బ్యాటింగ్ బలంతో నెట్టుకొస్తున్న ఆ టీంకు నిన్నటి మ్యాచ్ లో ఘోర అవమానం జరిగింది. ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆర్ సీబీ అత్యల్ప స్కోరు కూడా చేసి రెండు రికార్డులు తన పేరే రాసేసుకుంది.

 

ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 132పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 49 పరుగులకే ఆలౌట్ అయిపోయి అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.దీంతో అభిమానులు కోహ్లీ సేనపై సోషల్‌మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

 

ఆరీసీబీకి నెటిజన్లు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించారు. అదే 70189820250.ఇంతకీ ఈ నెంబర్ విశేషం ఏంటో తెలుసా... కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఆర్ సీబీ బ్యాట్స్ మెన్ లో చేసిన స్కోర్లు ఇవి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu