బిజెపి వైపు చూస్తున్న నలుగురు టిడిపి ఎంపిలు

First Published Jul 30, 2017, 12:12 AM IST
Highlights
  • చంద్రబాబు నాయుడి తీరుతో అసంతృప్తిగా ఉన్న నలుగురు ఎంపిలు బిజెపి వైపు చూస్తున్నారా?
  • ఈ నలుగురు అవకాశం రాాగానే బిజెపిలోకి దూకేస్తారని బిజెపి సర్కిల్స్ లో బాగా వినబడుతూ ఉంది
  • రాజ్యసభ ఎన్నికల తర్వాత అమిత్ షా  ఆంధ్ర మీద గురి పెడతారు, అందుకే సెప్టెంబర్ పర్యటన

భారతీయ జనతా పార్టీ అధ్య క్షుడు  అమిత్ షా శక్తి ఏమో గాని ఆయన ఏ పార్టీమీద గురిపెడితే, ఆ పార్టీలో భూకంప మొస్తుంది. ఆయన ఉత్తర ప్రదేశ్ పర్యటకు బయలుదేరాడా ఇద్దరు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్సీలు,  ఒక బిఎస్ పి ఎమ్మెల్సీ బిజెపిలోకి దూకారు. ఆయన గుజరాత్ నుంచి రాజ్యసభ కు గెలవడమే కాదు, సోనియాగాంధీకి అత్యంత  సన్నిహితుడు, సలహాదారు  అహ్మద్ పటేల్ ను ఓడించాలనుకున్నారా... అక్కడి కాంగ్రెస్ కాళ్లకింద భూమి కంపించింది. చివరకు ఉన్న ఎమ్మెల్యేలను కాపుడుకునేందుకు బెంగుళూరు క్యాంపు రాజకీయాలు నడపాల్సివస్తున్నది.

ఇలాంటి అమిత్ షా ఆంధ్రా మీద కన్నేశాడని చెబుతున్నారు. ఆయన సెప్టెంబర్ లో ఆంధ్రావస్తున్నాడు. పెద్ద రాజకీయలక్ష్యంతోనే వస్తున్నాడని చెబుతున్నారు. అది విజయవంతమయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిద్దర కరవవుతుందని చెబుతున్నారు.

అసలు విషయమేమిటంటే... అమిత్ షా తెలుగుదేశం పార్టీ కి చెందిన నలుగులు ఎంపిల మీద గురి పెట్టారని వినికిడి. వారు  రాయపాటి సాంబశివరావు( నరసరావు పేట), గల్లా జయదేవ్ (గుంటూరు), కేశినేని నాని( విజయవాడ), కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు(విజయనగరం). ఈ నలుగురకి ముఖ్యమంత్రితో సంబంధాలు బెడిశాయని చెబుతున్నారు. నలుగురు బాగా అసంతృప్తితో నలిగిపోతున్న సంగతి వారి మాటల ద్వారానే చాలా సార్లు వెల్లడయింది.

ఉదాహరణకు రాయపాటి కి టిటిడి ఛెయిర్మన్ పోస్టు ఇవ్వలేదు. దానికి తోడు ఆయన వచ్చేసారి గుంటూరు టికెట్ కావాలని అడుగుతున్నారట. ముఖ్యమంత్రి హామీ ఇచ్చే స్థితిలో  లేరని సమాచారం. తన తల్లి గల్లాఅరుణకు శాసనమండలి సీటు చంద్రబాబు తిరస్కరించడంతో గుంటూరు ఎంపి జయదేవ్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. గల్లాకుటంబం టిడిపిలోకి వచ్చేందుకు చేసుకున్న ఒప్పందలో భాగంగా 2014 ఎన్నికల్లో అరుణ ఓడిపోతే,  శాసన మండలికి తీసుకోవాలి. ఆమె చంద్రగిరి నుంచి ఓడిపోయారు. ఈ పాత ఒప్పందాలు కుదరవని ఇటివల పార్టీలో పట్టుసంపాదించిన చిన్నబాబు చెబుతున్నారుట.

ఇక కేశినేని, చంద్రబాబు గొడవ చాలా హిట్టయిన రాజకీయ ఘట్టం. చంద్రబాబు వల్ల తాను బిజినెస్ దివాళా తీసే పరిస్థితి వచ్చిందని నాని అక్కడ క్కడ వాపోతున్నారట. దానికి తోడు లోకేశ్ విజయవాడ లోక్ సభ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా నియమించడంతో వివాదం ముదిరింది. ఎందుకో గాని నాని లోకేశ్ కు  నచ్చడం లేదు. దీనితో ఆయనకు వచ్చే సారి పార్టీ టికెట్టు దొరకడమే కష్టమే నంటున్నారు. ఇది తెలిసినందునే బిజెపి నాని మీద గురి పెట్టింది. నారా బ్రాహ్మణి వచ్చే సారి విజయవాడ నుంచ పోటీ చేసి కెసిఆర్ కూతురు కవిత కి కౌంటర్ పార్ట్ ను చేయాలని లోకేశ్ మంత్రి కావాలని వత్తిడి తెచ్చిన వర్గమే ఈ వత్తిడి కూడా తెస్తోందని  టిడిపిలో వినపడుతూ ఉంది.

 

అశోక్ గజపతిరాజును విజయనగరం జిల్లాలో జీరోని చేసేశారు.ఉత్తరాంధ్రలో భూములకు వ్యాల్యూ పెరుగుతూ ఉండటంతో అక్కడ గంటా పెత్తనం పెరిగింది. దానికి తోడు, అశోక్ కు నచ్చని బొబ్బిలిరాజా సుజయకృష్ణ రంగారావుని వైసిపి నుంచి లాక్కుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. భూముల కబ్జారోజులలో అశోక్ నిజాయితీ అడ్డొచ్చే ప్రమాదం ఉంది. అందుకే లోకేశ్ 67 యేండ్ల  అశోక్ గజపతిరాజును రిటైర్ చేయించే ఉద్దేశం లో ఉన్నారట.

వాళ్లు బిజెపి వైపు, బిజెపి వీళ్ల వైపు చూస్తున్నారని, అందువల్ల మ్యాచ్ తొందర్లోనే ఫిక్సవుతుందని బాగా రాజకీయవర్గాల్లో బాగా వినబడుతూ ఉంది. టిడిపిని దగ్గర్నుండి జాగ్రత్త కనిపెట్టిన బిజెపి,  పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేసిందని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లేదా ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్ లు కథ నడిపిస్తారు. 

రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా బాగా పేరున్న నాయకులను  ఇతర పార్టీల నుంచి తెచ్చుకోవడానికి బిజెపి సిద్ధమయింది. ఇందులో భాగమే ఈ నలుగురి ఎంపిల మీద గురి.

click me!