రెండు రాష్ట్రాల్లోనూ నిజంగా ‘సన్ రైజ్’ లే

Published : Apr 19, 2017, 01:59 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
రెండు రాష్ట్రాల్లోనూ నిజంగా ‘సన్ రైజ్’ లే

సారాంశం

సన్ రైజ్ అంటే ఈపాటికి అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. తెలంగాణాలో అయితే కెసిఆర్ సంతానం కెటిఆర్, కవితతో పాటు హరీష్ రావు. ఏపిలో అయితే లోకేష్ ఒక్కరే.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సన్ రైజ్ బాగానే అవుతోంది. సన్ రైజ్ స్టేట్ అన్న నినాదం నిజానికి చంద్రబాబునాయుడుది. కానీ ముందు సన్ రైజ్ కనబడింది మాత్రం తెలంగాణాలో. ఎందుకంటే, కెసిఆర్ లో తెగింపు బాగా ఎక్కువ. అనుకున్న దాన్ని వెంటనే చేసేసే తెగింపు కెసిఆర్లో ఎక్కువుంది. అదే, చంద్రబాబులో వెతికినా కనబడదు. ప్రతీ దానికీ ఓ లెక్కుందంటారు. అందువల్లే ప్రతీ పని ఏపిలో బాగా ఆలస్యం అవుతూంటుంది. సన్ రైజ్ కూడా అందుకే ఆలస్యమైంది.

ఇంతకీ సన్ రైజ్ అంటే ఈపాటికి అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. తెలంగాణాలో అయితే కెసిఆర్ సంతానం కెటిఆర్, కవితతో పాటు హరీష్ రావు. ఏపిలో అయితే లోకేష్ ఒక్కరే. 2014 ఎన్నికల్లో ఎవరేమనుకున్నా మనకేం అనుకున్నారు కాబట్టే కెసిఆర్ తన కుమారుడు కె. తారకరామారావుకు, కూతురు కవితకు టిక్కెట్లు ఇచ్చేసారు. సెంటిమెంట్ ఉంది కదా. కాలం కలిసి వచ్చింది కాబట్టి ఇద్దరూ గెలిచేసారు. అదే విధంగా మేనల్లుడు హరీష్ రావు అప్పటికే చాలాసార్లు గెలిచారు కాబట్టి మొన్న కూడా గెలిచారు. దాంతో కెటిఆర్, హరీష్ మంత్రులుగాను, కవిత ఎంపిగా స్ధిరపడ్డారు. కెటిఆర్ తో కలుపుకుని కూతురు, మేనల్లుడితో తెలంగాణాలో సన్ రైజ్ బాగానే ఉన్నట్లు లెక్క.

ఇక ఏపిలో అయితే బాగా ఆలస్యమైంది. అందుకు కారణం ఏమంటే, కుమారుడు లోకేష్ కు టిక్కెట్టు ఇస్తే ఎవరేమనుకుంటారో అన్న భయం చంద్రబాబుది. అందుకనే అప్పట్లో పోటీకి దింపలేదు. పైగా అధికారంలోకి వస్తామో రామో అన్న అనుమానం ఒకవైపు. ఒకవేళ లోకేష్ పోటీచేసి ఓడిపోతే ఎంతటి అవమానం. సరే, ఎలాగో అధికారంలో వచ్చారు కాబట్టి అప్పటి నుండి సన్ రైజ్ ఎప్పుడు అవుతుందా అని తెగ ఇదైపోయారు తమ్ముళ్ళు. మొత్తానికి కాలం తరుముకువచ్చి ఈనెలలో దొడ్డిదోవన ఎంఎల్సీ అవ్వటం, వెంటనే మంత్రి కూడా అయిపోవటం చకచక జరిగిపోయింది. అంటే లేటుగా వచ్చినా లేటెస్టుగా అన్నమాట. మొదట్లో చంద్రబాబు సన్ రైజ్, సన్ రైజ్ అని అంటుంటే చాలామందికి అర్ధం కాలేదు. కానీ కాలం గడిచేకొద్దీ సన్ రైజ్ అంటే అసలైన అర్ధం తెలిసి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !