
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సినీ ఇండ్రస్టీలోనే కాదు.. పొలిటకల్ సర్కిల్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఆయనను అభిమానించే నటులే కాదు రాజకీయ నాయకులకు కొదవే లేదు. పార్టీ వేరైనా పవన్ అంటే తనకు పిచ్చి అభిమానం అని నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పేశారు. అంతమాత్రాన వైసీపీ నుంచి పవన్ పెట్టిన జనసేన పార్టీ లోకి జంప్ అవుతారనుకుంటే మీరు పొరబడినట్లే.
ఎందుకంటే సినిమాలో తాను పవన్ కు వీరాభిమానిని అయినా రాజకీయాల్లో మాత్రం జగన్ ఫాలోవర్ని అని చాలా క్లారిటీగా చెప్పేశాడు.జానీ లాంటి ప్లాప్ సినిమానే తాను 9 సార్లు చూశానంటే పవన్ కు ఎంత పెద్ద ఫ్యాన్నో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల విడుదలైన కాటమరాయుడు సినిమాను కూడా మొదటి షో నే చూశానన్నారు. హిట్ ప్లాప్ టాక్ లతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు చూస్తుంటానని చెప్పారు.
వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ ఎంబీబీస్ చేసినా డాక్టర్ గా ప్రాక్టీస్ చేయకుండానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి సారి 90 ఓట్లతో ఓడిపోయి తృటిలో విజయాన్ని దూరం చేసుకున్నారు. రెండోసారి మాత్రం 19 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.