అయిదొందలకే రిలయన్స్ జియో 4జి ఫోన్

First Published Jul 5, 2017, 12:00 PM IST
Highlights

రిలయన్స్ జియో మారొక  సారి మొబెల్ మార్కెట్ మీద మెరుపు దాడి చేయబోతున్నది. అయిదొందల రుపాయలకే  మొబెల్ ఫోన్ అందించేందుకు జియో సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని జూలై 21 జరిగే కంపెనీ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రకటించే అవకాశం ఉంది.  ఆగస్టు పదిహేను నుంచి జియో 4 జి ఫీచర్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావచ్చు.

 

 

రిలయన్స్ జియో మారొక  సారి మొబెల్ మార్కెట్ దాడి చేయబోతున్నది. అయిదొందల రుపాయలకే  మొబెల్ ఫోన్ అందించేందుకు జియో సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని జూలై 21 జరిగే కంపెనీ జనరల్ బాడీ మీటింగ్ లో ప్రకటించే అవకాశం ఉంది. 

 

ఆ రోజు జియో కొత్త ప్లాన్ లతో పాటు కొత్త చౌక ఫోన్ విడుదల గురించి ప్రకటన వెలువడుతున్నది కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇపుడు అమలులో ఉన్న ధన్ ధన్ ధన్ ఉన్న 84 రోజుల ప్లాన్ ముగియనుంది. ఈ ప్లాన్ ను రు. 309 కే అందించారు. ఇది ఏప్రిల్  అమలులోకి వచ్చింది. అందువల్ల  కొత్త ప్లాన్ లను ప్రకటించడంతో పాటు అతి తక్కువ ధరకు మొబెల్ అందిచాలన్నవ్యూహం కూడా రిలయన్స్ జియో సిద్ధం చేసుకుంది. ఆగస్టు 15 నుంచి ఈఫోన్ వినియోగ దారుల చేతుల్లో ఉండవచ్చు.

 

4జి వోల్ట్ ఫీచర్ ఫోన్ విడుదల చేసి 2జి వినియోగదారులెక్కడ ఉన్నలాగేసందేకు జియో ప్రయత్నిస్తున్నది. ఈ హ్యాండ్ సెట్ మీద  కొనుగోలు దారునికి  10 నుంచి 15 డాలర్ల అంటే రు.650 నుంచి –రు.975 దాకా సబ్సిడీ లభిస్తుంది.

 

4జి వోల్ట్ ఫోన్  రాగానే మార్కెట్  ఈ హ్యాండ్ సెట్ లతో నిండిపోనున్నది.ఎందుకంటే చైనీస్ కంపెనీలనుంచి 18 నుంచి 20 మిలియన్ల ఫోన్ దిగుమతి చేసుకునేందుకు రిలయన్స్ జియో ఒప్పందం చేసుకుంది.  ఈ పోన్ లు జూలై నెలాఖరు నుంచి ఇండియాక దిగుమతి కావడం మొదలుపెడతాయి.

 

click me!