మొదలేకాని అమరావతి మెట్రోకి బ్యాంక్ ఆప్ ఇండియా భారీ రుణం

First Published Jun 25, 2017, 4:20 PM IST
Highlights

 ఆంధ్రుల ప్రపంచస్థాయి రాజధాని అమరావతి ఎపుడు తయారవుతుందో గాని అన్ని హంగులు తయారవుతున్నాయి. అసలు ఒక బిల్లింగు కూడా లేకపోయినా నిన్న కేంద్రం అమరావతిని  స్మార్ట్ నగరం గా గుర్తించిది ఈ రోజు అమరావతి మెట్రో రైలు కు రు. 500 కోట్ల రుణం ఇచ్చేందుకు ఒక బ్యాంకు ముందుకు వచ్చింది.

ఒక వైపు అమరావతి మెట్రో ఆర్థికంగా అనుకూలంగా కాదని అంతా చెబుతున్నాబ్యాంక్ ఆప్ ఇండియా రుణం ఇచ్చేందుకు సిద్ధమయింది.

అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డితో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ , బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ శంకర నారాయణ ఈ రోజు సమావేశమై రుణ సహాయం గురించి చర్చించారు.

అమరావతి మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి.అంగీకరించారు.

రూ. 500కోట్లతో రుణం మంజూరు  చేస్తామని ఆయన  హామీ ఇచ్చారు.

త్వరలోనే రూ.500కోట్లు విడుదల చేస్తామని శంకర నారాయణ చెప్పారు.

మెట్రో రైలు  ప్రాజెక్టు లేదా ఎలివేటేడ్ బస్ కారిడార్ కు నిధుల్ని వినియోగిస్తామని మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి చెప్పారు.

click me!