ఒ ఆర్ ఆర్ ప్రమాదంలో హీరో రవి తేజ తమ్ముడు భరత్ మృతి

Published : Jun 25, 2017, 11:04 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఒ ఆర్ ఆర్  ప్రమాదంలో హీరో రవి తేజ తమ్ముడు భరత్ మృతి

సారాంశం

సినిమా నటుడు రవితేజ సోధరుడు  భరత్  రోడ్డు ప్రమాదంలో మృతి. పలు సినిమాల్లో నటించిన భరత్. గతంలో డ్రగ్స్ సప్లై కేసులో కీలక నిందుతుడిగా పట్టుబడ్డాడు..మధ్యం మత్తులో కార్ నడుపుతూ కొత్వాలుగుడా సమీపంలో సుమారు 140 స్పీడ్ లో ఆగివున్న డిసీఎం ను గుద్ది అక్కిడికి అక్కేడే మృతి.

 

సినిమా నటుడు రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు

అతి వేగంగా కారు నడుపుతూ ఆగిఉన్న లారీని ఢీకొనడంతో రాత్రి 10గంటలకు ఈ ప్రమాదం జరిగింది. తీ వ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఒక్కడే ఉన్నారు. రాత్రి ఎవరు చనిపోయింది తెలియదు.  ఈ ఉదయం మిత్రులు కొందరు వచ్చాక  అసలు విషయం తెలిసింది. పోలీసులు కూడా అతి కష్టం మీద చనిపోయింది సినిమా నటుడు భరత్ అనే సమాచారం రాబట్ట గలిగారు. మొదట మిత్రులంతా భరత్ పేరును చాలా సేపు నాన్చారు.

శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మరొక సమాచారం ప్రకారం  రాత్రి రోడ్డు మీద లారీ ఎలాంటి  ఇండికేటర్ లైట్లు వేయలేదని, రేడియం స్టిక్కర్లు కూడా లేవని అందువల్ల తాగిన మత్తులో వస్తున్న భరత్ ఈ లారీ గమనించకుండా ఢీకొట్టాడు. దీనితో కారు లారీ కిందికి దూసుకుపోయింది.

గతంలో డ్రగ్స్ సప్లై కేసులో కీలక నిందుతుడిగా పట్టుబడ్డాడు..మధ్యం మత్తులో కార్ నడుపుతూ కొత్వాలుగుడా సమీపంలో సుమారు 140 స్పీడ్ లో ఆగివున్న డిసీఎం ను గుద్ది అక్కిడికి అక్కేడే మృతి.

భరత్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా భరత్ నటించారు. 

  ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు.

భరత్ ది ఎప్పుడూ వివాదస్పదమైన జీవన శౌలియే. ఒకసారి పోలీసులను దూషించిన కేసులో జైలుకెళ్లాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. డ్రంకెన్ డ్రైవ్‌‌, డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రాత్రి 10గంటలకు జరిగినా ఉదయం పది గంటల దాకామృతి మీద స్పష్టత రాలేదు.

ఆయన మిత్రులు కూడామాత్రం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడం విశేషం.

ఇంత వరకూ అసలెందుకు గోప్యంగా ఉంచారు. అదివారం ఉదయం వచ్చి మృత దేహం తీసుకుపోయేందుకు ఎటా వచారు. మృతుడు రాజస్థాన్ కు చెందిన వ్యక్తి అని ఎందుకు చెప్పారు అనే విషయాల మీద స్పష్టత లేదు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !