ఫిబ్రవరిలో వెహికల్ రిజిస్ట్రేషన్ డౌన్ ట్రెండ్.. ప్రతికూల ప్రగతికి సంకేతమా?

By Arun Kumar PFirst Published Mar 13, 2019, 2:04 PM IST
Highlights

గత నెలలోనూ వాహనాల రిజిస్ట్రేషన్ పడిపోయిందని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్ సేల్స్ 8.25 శాతం పతనమైతే వాణిజ్య వాహనాలు దారుణంగా 7.08 శాతానికి.. ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ 7.9 శాతంగా నమోదైంది. ఇది ప్రతికూల పరిస్థితులకు నిదర్శమని ఫాడా అధ్యక్షుడు ఆశీష్ హర్షరాజ్ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: గత ఫిబ్రవరిలో ఆటోమొబైల్ వాహనాల రిటైల్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. జనవరి నెలతో పోలిస్తే 8.25 శాతం రిటైల్ సేల్స్ పడిపోయాయి. తద్వారా 2,15,276 వాహనాలకు పడిపోయాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) పేర్కొంది. ఇందులో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ మరీ 7.08 శాతానికి 61,134 యూనిట్లకు పడిపోయిందని ఫాడా ఆందోళన వ్యక్తం చేసింది. 

ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ 7.9 శాతానికి తగ్గి 11,25,405 యూనిట్లకు పడిపోయింది. ఫడా అధ్యక్షుడు ఆశీష్ హర్ష రాజ్ కాలే మాట్లాడుతూ జనవరిలో ప్రయాణ వాహనాల సేల్స్ పెరుగడానికి ఇయర్ ఎండ్ సేల్స్ కారణమన్నారు. వీటికి తోడు కొన్ని సంస్థలు మార్కెట్లో ప్రవేశపెట్టిన నూతన మోడల్ కార్లు, కొన్నింటిపై ప్రజల్లో గల ఆసక్తి, ఎక్సైట్ మెంట్ కారణమని ఆశీష్ హర్షరాజ్ తెలిపారు.

కానీ ఫిబ్రవరిలో వాహనాల కొనుగోళ్ల ప్రక్రియ తగ్గుముఖం పట్టడం ఆందోళనకరమేనని ఫడా అధ్యక్షుడు ఆశీష్ హర్ష రాజ్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అతి తక్కువ విక్రయాలు జరిగింది ఫిబ్రవరిలోనేనన్నారు. ఆరు నెలలకు పైగా విక్రయాలు పతనం కావడంతో దేశ ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 

 

click me!