నంబర్ ప్లేటు విలువ రూ.12కోట్లు..

First Published Aug 31, 2017, 12:34 PM IST
Highlights
  • ఒక నంబర్ ప్లేటు కోసం లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టాడో వ్యక్తి.
  • ఈ నంబరు ప్లేటుకి 1.5మిలియన్‌ ఆసీస్‌ డాలర్లు పలుకుతుందని భావించారు. కానీ వారు వూహించని దానికంటే భారీగా రికార్డు స్థాయిలో 2.45 మిలియన్  ఆసీస్‌ డాలర్లకు అమ్ముడుపోయింది.

 

కొత్త కారు కి నంబర్ ప్లేటు తీసుకునేటప్పుడు చాలా మంది తమకు ఇష్టమైన నంబర్, లేదా అదృష్ట సంఖ్య ఉండేలా చూసి మరీ తీసుకుంటారు. ఇందుకు కాస్త ఎక్కవ మొత్తాన్ని కూడా చెల్లిస్తూ ఉంటారు. ఇక సెలెబ్రి

టీలైతే.. రూ.లక్షలు చెల్లించడానికి కూడా వెనకాడకుండా తమకు నచ్చిన నంబర్ ప్లేటును తీసుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ.. ఒక నంబర్ ప్లేటు కోసం లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టాడో వ్యక్తి. ఇప్పటి వరకు కేవలం ఒక నంబర్ ప్లేటు కోసం ఇంత ఖర్చు ఎవరూ పెట్టి ఉండరు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల   ఆస్ట్రేలియాలో ఓ నంబర్‌ ప్లేటు కోసం  వేలం నిర్వహించారు. ఈ  వేలంలో ‘ఎన్‌ఎస్‌డబ్ల్యూ 4’ నంబర్‌ ప్లేటు అక్షరాలా 2.45మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. ఇండియన్‌ కరెన్సీలో ఇది సుమారు రూ.12.8కోట్లు.

వేలానికి ముందు నిర్వాహకులు ఈ నంబరు ప్లేటుకి 1.5మిలియన్‌ ఆసీస్‌ డాలర్లు పలుకుతుందని భావించారు. కానీ వారు వూహించని దానికంటే భారీగా రికార్డు స్థాయిలో 2.45 మిలియన్  ఆసీస్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అయితే ఇంత ధర చెల్లించి ఈ నంబరు ప్లేటును ఎవరు దక్కించుకున్నారో మాత్రం నిర్వాహకులు తెలియజేయలేదు. కాగా చైనా సంతతికి చెందిన వ్యక్తి, ఆస్ట్రేలియాలో సిర్థపడిన బిలినియర్‌ పీటర్‌ సెంగ్‌ ఈ నంబర్‌ ప్లేటును దక్కించుకున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. సిడ్నీలో నిర్వహించిన వేలంలో ఈ స్థాయిలో నంబరు ప్లేటు అమ్ముడుపోవడం ఇదే తొలిసారని వేలం నిర్వాహకుడు క్రిస్టోపే బోరిబాన్‌ తెలిపారు.

పీటర్‌ ఈ వేలంలో పాల్గొనేందుకు ఎరుపు రంగు ఫెరారీ కారులో వచ్చాడని, ఆ కారు నంబరు 2 అని, హాంకాంగ్‌ రిజిస్ట్రేషన్‌తో నంబర్‌ 1 ప్లేటు కూడా పీటర్‌ వద్ద ఉందని స్థానికులు తెలిపారు. 2003లో నిర్వహించిన వేలంలో ‘నంబర్‌ 2’ ప్లేటు 6.8లక్షల ఆసీస్‌ డాలర్లకు అమ్ముడుపోవడమే ఇప్పటి వరకు రికార్డు అని వారు తెలిపారు.

 

click me!