తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మెట్రోస్టేషన్ల సుందరీకరణ

Published : Aug 31, 2017, 11:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మెట్రోస్టేషన్ల సుందరీకరణ

సారాంశం

మెట్రో స్టేషన్లు మరింతగా ప్రజలు ఆకట్టకునేందుకు అధికారులు సుందరీకరణ పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. లార్సెన్, టర్బో మెట్రో రైల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు చెందిన ప్రకటన బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు

 

మెట్రో రైలు కోసం హైదరాబాద్ నగర ప్రజలు.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెట్రో రైలు సర్వీసు ఎప్పు ప్రారంభమౌతుందా.. ఎప్పుడు ఎక్కుదామా అని  మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే.. మెట్రో స్టేషన్లు మరింతగా ప్రజలు ఆకట్టకునేందుకు అధికారులు సుందరీకరణ పనులు చేపట్టాలని యోచిస్తున్నారు.

ఇందు కోసం ప్రత్యేకంగా ఒక ఆర్టిస్టును కూడా నియమిస్తున్నారు. హెచ్ ఎం ఆర్ ఎల్( హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వీఎస్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. మెట్రో రైల్వే స్ట్రక్చర్, మెట్రో పరిసరాలను అందంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. మెట్రో రైలుకు నాలుగు వైపులా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉన్న  రెండు పిల్లర్లకు.. లార్సెన్, టర్బో మెట్రో రైల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు చెందిన ప్రకటన బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. మరో రెండు పిల్లర్లకు ఆర్ట్ వర్క్, వర్టికల్ గార్డెన్లు ఏర్పాటు చేయనన్నట్లు చెప్పారు.

తెంలగాణ సాంప్రదాయం, చరిత్ర జీవిన విధానం.. వంటి థీమ్స్ లను ఉపయోగిస్తామని చెప్పారు. మెట్రో పిల్లర్లను చూస్తేనే.. తెలంగాణ గురించి పూర్తిగా తెలిసేలా చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సిమెంట్, మోసాయిక్, సెరామిక్, స్టోన్స్, టెర్రాకోటా, స్కార్ప్, ఫైబర్ గ్లాస్ వంటి వాటిని ఉపయోగించి ఆర్టిస్టు మెట్రోని అందంగా తీర్చి దిద్దుతారని ఆయన వివరించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !