మగవాళ్లకే గుండె పోట్లెక్కువ

First Published Aug 31, 2017, 11:03 AM IST
Highlights
  • ఈ మధ్య కాలంలో వయసు తారతమ్యాలు లేకుండా అందరూ గుండె పోటు బారిన పడుతున్నారు
  • ఈ గుండెపోటు అధికంగా పురుషుల్లోనే వస్తోందట.

 

గుండె గుప్పెడంతే ఉంటుంది. కానీ.. మనిషికి ఆయువు పట్టు ఈ గుండె. ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో మనిషి జేబులు నింపుకోవడానికి చూపుతున్న ఆసక్తి.. ఆ జేబు వెనక ఉండే గుండె మీద చూపడం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో వయసు తారతమ్యాలు లేకుండా అందరూ గుండె పోటు బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్ల వయసు దాటిన వారికి అడపా దడపా ఈ సమస్య ఎదురయ్యేది. కానీ ప్రస్తుతం 25ఏళ్ల కుర్రడు కూడా గుండె పోటుతో మరణించాడనే వార్తలు వింటున్నాం. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేము. అయితే.. ఈ గుండెపోటు అధికంగా పురుషుల్లోనే వస్తోందట.

ప్రముఖ కార్డియాలజిస్టు లోకేశ్వరరావు దీనిపై 20 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనల ప్రకారం.. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో గుండె పోటు వస్తుందని తేలింది. 11,697 మంది గుండె పోటు వచ్చిన రోగులు ఉంటే.. వారిలో 87శాతం మంది పురుషులే ఉన్నారట. అంతేకాదు.. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్ లోనే ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయట.

భారత్ లో గుండె పోటు బారిన పడి.. బైపాస్ సర్జరీ చేయించుకునే వారిలో ఎక్కువ మంది 58 సంవత్సరాల వయసులోపు వారే కావడం గమనార్హం.  ఇతర దేశాలలో మాత్రం 66 సంవత్సరాల పైబడిన వారు బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారట.

ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలోనూ ఈ గుండెపోటుతో బాధవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని డాక్టర్ లోకేశ్వరరావు తెలిపారు. ఆయన తన బృందంతో కలిసి దాదాపు 12వేల మంది రోగుల మీద ఈ పరిశోధన జరిపినట్లు చెప్పారు. ఆయన పరిశోధనల ప్రకారం 2016లో ప్రపంచ వ్యాప్తంగా 16లక్షల మంది బైపాస్ సర్జరీలు చేయించుకున్నారట. అందులో భారతీయులు 1.40లక్షల మంది ఉన్నట్లు తేలింది. అమెరికాలో 1.8లక్షల మందికి ఈ సర్జరీలు కాగా.. రెండో స్థానంలో భారత్ నిలిచింది. ఈ సర్జరీలు చేస్తుండగా, సర్జరీ చేసిన నెలలోపు చనిపోతున్నవారు 0.7శాతం మంది ఉన్నారని  నిపుణులు చెప్పారు.

click me!