
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈరోజు ఉదయం ఓ నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది.ఘట్ కోపూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 9 మందిని రక్షించి.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో 30 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.