రెండో టెస్టులో శ్రీలంకపై భారత్ ఘనవిజయం

First Published Aug 6, 2017, 8:55 AM IST
Highlights
  •  విశాఖ భూ కుంభకోణంలో మరో 17 మందికి  షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన   సిట్‌ బృందం
  • రెండో టెస్టులో శ్రీలంకపై భారత్  ఘన విజయం  
  • డ్రగ్స్ కేసులో నైజీరియాకు చెందిన జాన్ బాస్కో, కాకినాడ కి చెందిన మహమ్మద్ జహరుల్లా  అరెస్ట్
  • సోమవారం రాత్రి  10.52 గంటల నుండి 12.48 గంటల వరకు   కొనసాగనున్న చంద్రగ్రహణం
  • కేసీఆర్ పై మల్లు రవి ఆగ్రహం
  • జగిత్యాల జిల్లాలో  జయశంకర్  విగ్రహాన్నిఆవిష్కరించిన  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
  • మహిళా జర్నలిస్టుపై వేధింపుల కేసు పెట్టిన జాతీయ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లాని

పోచంపాడు కెసిఆర్ సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న హరీశ్



నిజామాబాదు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఎస్సారెస్పీ పునర్జీవన ప్రాజెక్ట్  పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే శంకుస్థాపన, బహిరంగ సభాస్థలిని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి , అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. ఎస్సారెస్పీ అతిథి గృహం వద్ద ఉన్న హెలీప్యాడ్, రోడ్డు, పార్కింగ్ తదితర సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఎమ్యెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. ప్రతిష్టాత్మక మయిన ఈ సభను టిఆర్ ఎస్ ప్రభుత్వం విజయోత్సవ సభగా ఆగస్టు 10 న నిర్వహిస్తున్నారు.
  సీఎం కేసీఆర్‌ పై సీపీఎం  ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు

సీఎం కేసీఆర్‌ కమ్యూనిస్టులపై కక్షగట్టారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్‌తో తమకను వ్యక్తిగతంగా దూషించడాన్ని మానుకోవాలని తమ్మినేని సూచించారు.సొంత జిల్లాలోని మల్లన్నసాగర్‌ నిర్వాసితులు, వేములఘాట్‌ రైతుల పట్ల సీఎం వివక్ష తగదన్నారు. వీటి గురించి ుద్యమిస్తున్న  ప్రతిపక్షాలను నిందిస్తూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  

మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టిన సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లాని  

జాతీయ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లాని ఓ టీవీ మహిళా జర్నలిస్టుపై కేసు పెట్టారు. ఆమె వేధింపులు తనపై ఎక్కువయకయ్యాయని ఆయన పోలీసులకు తెలిపారు. భయాందోళనకు గురి చేస్తున్న ఆమెపై గిర్‌గౌమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యాలయ ప్రాంగణంలో  ఎప్పుడూ తన వెంట తిరుగుతు,అత్యుత్సాహంతో నన్ను ఇబ్బందులపాలు చేస్తోందని ఆయన పోటీసులతో చెప్పారు.  తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆమెపై  చర్యలు తీసుకోవాలని నిహ్లాని పోలీసులకు తెలిపారు. 

జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరణ ఎంపీ కవిత

జగిత్యాల జిల్లాలో తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో నెలకొల్పిన జయశంకర్  విగ్రహాన్నిజాగృతి అద్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత  ఆవిష్కరించారు. జయశంకర్ సార్ ఆశయమైన బంగారు తెలంగాణ గా రూపొందించడానికే కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు.  రానున్న రోజుల్లో వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లో కూడా విగ్రహాలను జయశంకర్ సార్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు కవిత తెలిపారు. జయశంకర్, కేసీఆర్ లది గురుశిష్యుల బందమని, వారి పోరాటాలే   తెలంగాణ ను సాధించిపెట్టాయని ఎంపీ కవిత  అన్నారు. 
 

జిఎస్ టి  కోసం కేసీఆర్ పోరాటం ఎలా చేస్తాడు:  మల్లు రవి

తెలంగాణ లో  ప్రజలు, ప్రతిపక్ష పార్టీ లు  న్యాయ పోరాటం చేస్తే పిశాచాలు, దయ్యాలు అంటున్న కేసీఆర్ జిఎస్ టి పైన  కేంద్రంపై ఎలా న్యాయ పోరాటం చేస్తారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి ప్రశ్నించారు. తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అంటే ఇది కదా  అని  టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు.

 జిఎస్ టి  బిల్లు అమలు చేసినపుడు బీజేపీ రాష్ట్రాల కంటే ముందు గానే కనీసం చర్చ కూడా పెట్టకుండా అసెంబ్లీలో ఆమోదం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం తో న్యాయ పోరాటం చేస్తారని ఆయన అన్నారు.

తనకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అని ప్రశ్నిచారు.
ముస్లిం రేసేర్వేషన్ విషయం లో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా అన్నాడు, ఇక్కడ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసాడు, ఇది కేసీఆర్ నైజం అని ఆయన అన్నాడు.

రేపు పాక్షిక చంద్రగ్రహణం

రేపు సోమవారం రోజున పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం   రాత్రి  1౦.52 గంటల నుండి 12.48 గంటల వరకు   కొనసాగనుంది. ఈ ఏడాదిలో పూర్తిస్థాయిలో కనబడనున్న చంద్రగ్రహణం ఇదేనని  బిర్లా ప్లానిటోరియం రిసర్చ్ అండ్ అకాడమిక్ డైరెక్టర్ దేవీప్రసాద్ దువారీ తెలిపారు.  ఈ చంద్రగ్రహణ పరిణామాలు ఖగోళ శాస్త్రంలో పరిశోధనలకు విశేషంగా దోహదం చేస్తుండటంతో దేశంలోని ప్రముఖ ప్లానిటోరియంలలో దీనికి సంబంధించి  ఏర్పాట్లు చేశారు.  అయితే ఈ చంద్రగ్రహణాన్ని నేరుగా చూడవచ్చని, కళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.మామూలుగా చూడటం కంటే బైనాక్యులర్‌లను వినియోగిస్తే స్పష్టత ఉంటుందని వారు వెల్లడించారు.   
 

డ్రగ్స్ కేసులో మరో నైజీరియన్ అరెస్ట్


డ్రగ్స్ కేసులో రోజుకో ముఠా బైటపడుతుండటంతో నిఘా పెంచిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో  ఇద్దరు నిందితులు ను అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన చెందిన జాన్ బాస్కో , కాకినాడ కి చెందిన మహమ్మద్ జహరుల్లా ను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 180 గ్రాములు కొకైన్ , 4 సెల్ ఫోన్స్ , ఒక మోటార్ సైకిల్ సీజ్ చేశారు. బిసినెస్ వీసా పై ఇండియా కు వచ్చిన జాన్ బాస్కో డ్రగ్స్  హైదరాబాద్ లో మహమ్మదు ల్లా  ద్వారా డ్రగ్స్  అమ్మకాలకు తెర లేపాడు. మంబై కేంద్రంగా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని చేదించడానికి   నిందితుల కాల్ లిస్ట్  లోని సినీ ఇండస్ట్రీ లింక్స్ , ఐటీ లింకులపై విచారణ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబా రెడ్డి తెలిపారు.
 

తుమ్మలను పరామర్శించిన సీఎం కేసీఆర్

యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.   ఆసుపత్రికి వెళ్లి తుమ్మలతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి  చికిత్స అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. తగినంత విశ్రాంతి తీసుకుని ,   కోలుకున్న తర్వాతే  విధులకు హాజరుకావాలని సిఎం కేసీఆర్ తుమ్మలకు సూచించారు.

రెండో టెస్టులో శ్రీలంకపై భారత్ ఘనవిజయం

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు భారీ విజయాన్ని సాధించింది. మూడు టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్  మిగిలుండగానే భారత జట్టు  కైవసం చేసుకుంది.  రెండోఇన్నింగ్స్ లో శ్రీలంకను 386 పరుగులకే  ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించింది. దీంతో మిగిలివున్న మరో మ్యాచ్ తో సంభందం లేకుండా సిరీస్ 2-0 తో భారత్ వశమైంది.  సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని కైవసం చేసుకున్నట్లు కోహ్లీ తెలిపారు.

మరో 17 మందికి సిట్ నోటీసులు

 విశాఖ భూ కుంభకోణానికి సంభందించి విచారణ జరుపుతున్న సిట్‌ బృందం  17 మంది రెవెన్యూ  అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సైనికులకు కేటాయించిన భూముల్లో  పెద్దఎత్తున  ఆక్రమణలు, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు సిట్‌ అధికారులు. ఇప్పటికే 13 మంది తహసీల్దార్లకు నోటీసులు జారీచేసి వివరణ అడగనున్నట్లు కలెక్టర్‌ కు విన్నవించిన  సిట్, ఆ జాబితాలో మరో 17 మంది అధికారులను చేర్చింది. 

ముద్రగడకు మద్దతుగా ఊరంతా ఉపవాసం


గృహనిర్భందంలో ఉన్న కాపు నేత ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా బోడపాటి వారి పాలెం గ్రామంలోని కాపులంతా ఈ రోజు ఉపవాస దీక్ష  చేపట్టారు. చంద్రబాబుకి బుద్ది ప్రసాదించాలని దేవుడిని కోరుతూ కాపు  సామాజిక వర్గం మొత్తం  కుటుంబం సమేతంగా ఉపవాసదీక్ష నిర్వహిస్తున్నారు. ముద్రగడకు మద్దతుగా నిలిచి,కాపు రిజర్వేషన్ లను సాధించితీరతామని తెలిపారు.   

ముద్రగడ పాదయాత్రను నేడుమళ్లీ అడ్డుకున్న పోలీసులు

కాపురిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు ఆదివారం నాడు మళ్లీ అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి నుంచి ఆదివారం నాడు ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేశారు.  ఆయన గృహనిర్బంధానికి నేడు ఆరో రోజు. అయితే, పోలీసులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. లోనికి పంపించారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు పాదయాత్రకుఅనుమతులు ఉండాలని, ముద్రగడ ఎలాంటి  అనుమతి తీసుకోలనదని వారు చెప్పారు.  

           దీనితో    ముద్రగడతో పాటు కాపు జేఏసీ కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఇది ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత కు దారి తీసింది. శనివారం నాడు కూడా ఆయన పాదయాత్రను కొనసాగనీయలేదు. దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ 24 గంటల్లో పాదయాత్రకు  అనుమతి నీయాలని  లేదా అరెస్టు చేస జైలుకు పంపండని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మెరుగుపడుతున్న బాలీవుడ్ మెగాస్టార్  దిలీప్‌కుమార్ ఆరోగ్యం  

బాలీవుడ్ మెగాస్టార్ దిలీప్‌కుమార్ ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు  లీలావతి  హాస్పిటల్ డాక్టర్ అజయ్‌కుమార్ పాండే తెలిపారు.94 ఏళ్ల వయసున్న దిలీప్ డీహైడ్రేషన్, మూత్రనాళ సమస్యలతో  ముంబైలోని లీలావతి హాస్పిట‌ల్లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే.  మ‌రో మూడు రోజుల పాటు దిలీప్ ని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించనున్నట్లు డాక్టర్లు తెలిపారు.  

జయశంకర్ తెలంగాణ సమాజానికి స్పూర్తి - కేసీఆర్ 

 

ప్రొఫెసర్ జయశంకర్  జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మాట్లాడారు. సార్ లో తనకున్న అనుబందాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు.  మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, భావజాల వ్యాప్తికే  జయశంకర్ సార్ లన జీవితాన్ని ధారపోశారని సిఎం కొనియాడారు.   తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్పూర్తి ప్రధాతగానే ప్రొపెసర్ జయశంకర్  నిలుస్తారన్నారు.

  నిలకడగా ఆడుతున్న శ్రీలంక జట్టు

భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాడు కరుణరత్నే సెంచరీ సాధించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా  224 బంతుల్లో శతకం సాధించాడు.  ప్రస్తుతం క్రీజులో కరుణరత్నేకు తోడుగా ఎంజిలో మాథ్యూస్ ఆడుతున్నాడు.  భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే శ్రీలంక 190 పరుగులు వెనుకబడి ఉంది.ప్రస్తుతం శ్రీలంక స్కోరు 250/4.

తుమ్మలను పరామర్శించిన రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి

 యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నురవాణా మంత్రి మహేందర్ రెడ్డి  పరామార్శించారు. తుమ్మల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.ఆయన  త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు తెలిపినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

సోమవారం తిరుమలలో శ్రీవారి ఆలయం మూసివేత

సోమవారం చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.  అన్నప్రసాద వితరణను రేపు సాయంత్రం 4 గంటల నుంచి నిలిపివేయనున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. మంగళవారం పొద్దున 2 గంటల వరకు శ్రీవారి ఆలయంతో పాటు,తిరుమలలోని అన్ని ఆలయాలు మూసి వుంటాయని జేఈవో తెలిపారు.  

మాయమయి మృత దేహంగా కనిపించిన డాక్టర్ సూర్య కుమారి

మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

విజయవాడ:  నాలుగు రోజుల కిందట  మాయమయిన విజయవాడ డాక్టర్  సూర్యకుమారి మృత దేహం లభ్యమయింది. విజయవాడ సమీపంలోని కంకి పాడు లో కనిపించిన మత దేహం డాక్టర్‌ సూర్యకుమారిదే నని పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఎన్ ఆర్ డి ఎఫ్ సిబ్బంది నిన్నంతా జరిపిన గాలింపులునిడమానూరు వంతెన కింద  సూర్యకుమారి మృతదేహాం లభ్యమయింది.  సూర్యకుమారి ధరించిన బంగారు అభరణాల ను బట్టి బావ, మేనమామ మృత దేహాన్ని గుర్తించారు. దానిని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సూర్యకుమారి కేసులో విచారించి వదిలిపెట్టిన మాజీ శాసన సభ్యులు జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ ని మాచవరం పోలిసులు మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ జాయింట్ పోలిస్ కమీషనర్ బి వి రమణ కుమార్ మృతదేహాన్ని  గుర్తించిన ప్రాతానికి వచ్చి బంధువులనుంచి సూర్యకుమారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

జయశంకర్ సార్ కు కెటిఆర్ నివాళి

 

🙏🙏 🙏🙏🙏🙏 pic.twitter.com/ViBECrpe2S

— KTR (@KTRTRS) August 6, 2017
click me!