
చైనా ప్రొడక్ట్ ని చిత్తు చేశాడు ఇండియన్ బాక్సర్ విజేందర్. మొదటి నుండి చైనా బాక్సర్ మైమైతియాలిని ‘చైనా ప్రొడక్ట్’గా విజేందర్ అభివర్ణిచాడు. చివరికి అదే నిజం చేశాడు.
శనివారం ముంబైలో జరిగిన బౌట్‌లో చైనా బాక్సర్ జుల్పికర్ మైమైతియాలిని చిత్తుగా ఓడించాడు విజేందర్. దీంతో విజేందర్ ఖాతాలో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ చేరింది. మ్యాచ్ లో విజేందర్, మొదటి నుండి బజుల్పికర్ మైమైతియాలి పై పంచ్ ల వర్షం కురిపిస్తు చివరికి విజయం సాధించాడు. తొమ్మిదవ మ్యాచ్ లో కూడా చాంపియన్‌గా అవతరించాడు.
చైనా బాక్సర్ పై మాటలతోనే కాకుండా పంచులతో కూడా తన ప్రతాపం చూపించాడు భారత బాక్సర్ విజేందర్ సింగ్. ఒక్క అపజయం లేకుండా విజేందర్ సింగ్ దూసుకుపోతున్నాడు. విజేందర్ సింగ్ తాజా విజయం తన ప్రొపెషనల్ కెరీర్‌లో వరుసగా తొమ్మిదోది.
చైనా బాక్సర్ జుల్పికర్ మైమైతియాలిని కూడా విజేందర్ ను ‘మీ ఇంటి కొచ్చి, మీ ప్రేక్షకుల ముందే నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తా’ అని శపథం చేశాడు. కానీ చివరకు ఆయనే ఓటమితో ఇంటి ముఖం పట్టాడు.