రోడ్డు ప్రమాదంలో విదేశీయులు మృతి

Published : Aug 05, 2017, 05:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రోడ్డు ప్రమాదంలో విదేశీయులు మృతి

సారాంశం

మినీ బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది మృతుల్లో  నలుగురు స్పెయిన్‌ దేశస్థులు 

 

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం యాతాల వంక సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో విదేశీయులు మృత్యువాత పడ్డారు. అనంతపురం నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మినీ బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. వారిలో నలుగురు స్పెయిన్‌ దేశస్థులు ఉన్నారు.

కొందరు స్పెయిన్‌ దేశస్థులు రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టును ఏర్పాటు చేసి అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతుతున్నారు. ఇందులో భాగంగా వీరు అనంతపురంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం పాండిచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 9మంది స్పెయిన్‌ దేశస్థుల్లో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిచాల్సిందిగా ఆయన

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !