దిల్ రాజు పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు​ ​​ ​

Published : Sep 16, 2017, 10:22 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
దిల్ రాజు పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు​    ​​    ​

సారాంశం

విశేష వార్తలు దిల్ రాజు పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు ముంబైలోని ఆర్కే స్టూడియో లో అగ్ని ప్రమాదం ఆగివున్న లారీ ని మినీ వ్యాన్ ఢీ, ఐదుగురు మృతి హైదరాాబాద్ లో ఇక రాత్రి పూట సిటీ బస్సులు రోడ్డు ప్రమాదం సింగరేణి కార్మిక నేత మృతి ఇంకా  ఎన్నో...

 

స్కూలు బస్సు ప్రమాదంలో వృద్ధురాలు మృతి


ఒక పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా   వృద్దురాలు మృత్యు వాత పడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన చింపుల అనంతమ్మ(67) కమ్మెట గ్రామంలో ఉన్న చెల్లెలు బానురు మణెమ్మ దగ్గరకు  వచ్చింది. చెల్లెలితో కలసి దేవుని ఎర్రవల్లి గ్రామానికి తిరుగు ప్రయాణమయింది.  ఆపుడే  దేవుని ఎర్రవ్లలి గ్రామానికే చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు రావడంతో డ్రైవర్‌ను సహాయం అడిగారు.  డ్రైవర్ సరేనన్నాడు. చెల్లెలు మణెమ్మ బస్సు ఎక్కింది. అక్క అనంతమ్మ బస్సు ఎక్కే లోపు  బస్సు కదిలింది. అనంతమ్మ కింద పడింది. బస్సు చక్రాలకు దొర్లి  అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనతో డ్రైవర్ పరారయ్యాడనిపోలీసులుతెలిపారు. 

 

దిల్ రాజు పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదయింది. అతడు నిర్మాతగా వ్యవహరించిన "మిస్టర్ పర్ ఫెక్ట్'' సినిమా కోసం ''నా మనస్సు నిన్ను కోరే''  అనే నవలను కాఫీ చేశారని నవలా రచయిత శ్యామల రాణి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా నవలను వాడుకున్నందుకు  ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన పోలీసులు దిల్ రాజు పై 120ఏ , 415 , 420 కాపీ రైట్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
 

జైలు సిబ్బందిపై ఉగ్రవాదుల దాడి 

చంచల్ గూడ జైళ్లో ఐసిస్ ఉగ్రవాద ఖైదీలు గందరగోళం సృష్టించారు. డ్యూటీలో ఉన్న వార్డర్ భరత్ తో పాటు మరికొందరు పోలీస్ సిబ్బందిపై దాడికి తెగబట్టారు. దాడికి పాల్పడినవారిలో ఇబ్రహీం యజ్దానీ, ఇలియాస్ యజ్దానీ, అతఉల్లా  రెహమాన్ లు ఉన్నారు. ములాకత్ లో వారికి వచ్చిన వస్తువులను పరిశీలించడంతో ఆగ్రహించిన ఉగ్రవాదులు దాడికి పాల్సడ్డారు.
వార్డర్ ఫిర్యాదు మేరకు డబీర్ పురా పోలీసులు వీరిపై  కేసు నమోదు చేసుకున్నారు.  

ఆర్కే స్టూడియోలో అగ్ని ప్రమాదం

ముంబైలోని ఆర్కే స్టూడియోలో సూపర్ డాన్సర్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో సెట్ లో ఎవరు లేకపోవడంతో ఆస్తినష్టమే గాని,ప్రాణనష్టమేమి సంభవించలేదు. భారీగా మంట‌లు వ్యాపించడంతో ఫ‌ర్నీచ‌ర్ మొత్తం ద‌గ్ధ‌మ‌య్యింది.  ఆరు ఫైరింజ‌న్లు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి.  షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి వుంటుందని స్టూడియో సిబ్బంది అనుమానిస్తున్నారు.

మేడిపల్లి ఎస్సై వెంకట్ రెడ్డిపై  వేటు 

మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో బార్య, భర్తల వివాదంలో కేసులో మైనర్ పిల్లలని పోలీస్ స్టేషన్లో నిర్భందించిన  ఎస్సై వెంకట్ రెడ్డిపై వేటు పడింది.పిల్లల్ని నిర్భందించడమే కాదు, వారిని కలవడానికి వచ్చిన యువకులను చితకబాదినందుకు ఎస్సై పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన్ను మేడిపల్లి ఎస్సై పదవి నుండి తొలగించిన రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్...కమీషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ   అదేశాలు జారీచేశారు.

హైదరాాబాద్ లో ఇక రాత్రి పూట సిటీ బస్సులు

హైదరాబాద్ లో దూర ప్రాంతాలలో ఉండే  ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని  రాత్రి పొద్దు పోయాక కూడా  సిటి బస్సు లను నడిపించేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నిర్ణయించింది. ప్రతి రోజు రాత్రి 9 గంటల తర్వాత బస్సులు లేక ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు.  ఇలాంటి  వారికి అండగా ఉండాలని ఆర్టీసి నిర్ణయించింది.  ట్రాఫిక్ సర్వే ఆధారంగా హయత్‌నగర్, ఎన్‌జీవో కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, కుషాయిగూడ, కాళీమందిర్, జీడిమెట్ల, సీబీఎస్, కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, మియాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు, బోరబండ, సుచిత్ర, మెహిదీపట్నం, తాళ్లగడ్డ, బడంగ్‌పేట్, ఉప్పల్ మొదలగు ప్రాంతాల ప్రజలకు కోసం పొద్దుపోయాక బస్సులు అవసరమని గుర్తించారు.  ఈ ప్రాంతాలకు అర్థరాత్రి వరకు బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

 

రోడ్డు ప్రమాదం సింగరేణి కార్మిక నేత మృతి

బెజ్జంకి  క్రాస్ రోడ్డు వద్ద జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మిక నాయకుడు రఘువీరారెడ్డి మృతి చెందాడు.

ఆగివున్న లారీ నిమినీ వ్యాన్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.వ్యాన్ లో ప్రయాణిస్తున్న

సింగరేణి కార్మిక నాయకుడు రఘవీరా రెడ్డి మృతి చెందగా మరొక 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అపోలో అసుపత్రికి తరలించారు.

ఉల్లి రైతుది షాక్ చావు కాదుట, మార్కెట్ యార్డ్ అధికారి వివరణ

 

 

మలక్ పేట మార్కేట్ లో ఉల్లిగడ్డ లకు గిట్టుబాటు ధర రాకపోవడంతో దస్తగిరి(బుజ్జి)అనే రైతు  షాక్ తిని  గుండెపోటుతో మరణించాడు. ఈ వార్తని శనివారం ఉయదమే టి.వి.చానళ్లలో పెద్ద ప్రసారం చేశారు. ఉల్లిగడ్డ ధరలు క్వింటాల్ కు కేవలం ఐదు వందలు. ధరలు పడిపోవడంతో ధర రాక హతాశుడై  గుండెపోటుతో  బుజ్జి మృతి చెందాడని సాటిరైతులు కొందరు చెప్పారని టివిల కథనం.

అయితే, రైతు ఆత్మ హత్య అనే సరికి ప్రభుత్వం ఉలిక్కి పడింది. దీనితో మార్కెట్ యార్డ్  అధికారులు అది షాక్ చావు కాదని, అనారోగ్యం వల్ల జరిగిందని వివరణ ఇచ్చారు.  ఇది వివరణ: 

‘‘ధరలు పడిపోవడంతో షాక్ తిన్న రైతు ఒకరు గుండె ఆగి చనిపోయినట్లు  వస్తున్న వార్తలు నిరాధారం.అసత్యం.13.09.17 రాత్రి కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం పెద్దనాటూరు గ్రామానికి చెందిన రైతులు ఉల్లిగడ్డ లను మలక్ పెట్ మార్కెట్ కు తీసుకు వచ్చారు.అందులో దస్తగిరి కూడా ఉన్నాడు. అదే రాత్రి దస్తగిరి మార్కెట్ పరిసరాల్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తపు వాంతులు చేసుకోవడంతో హమాలీలు 108కు సమాచారం అందించారు.108 వాహనం లోని సిబ్బంది ప్రాధమిక చికిత్స చేసి ఆ రైతును ఇంటికి తీసుకు వెళ్లాలని సూచించారు. కర్నూలు జిల్లా స్వగ్రామానికి తోటి రైతులు వేరే వాహనం లో తరలిస్తుండగా 14.09.17 తెల్లవారు ఝామున దారిలోనే దస్తగిరి ప్రాణాలు కోల్పోయినట్టు మాకు తెలిసింది.14.09.17 న మలక్ పేట మార్కెట్ లో దస్తగిరి సరుకును వేలంలో మల్లిఖార్జున ట్రేడర్లు కొన్నారు. ఆ డబ్బును వాళ్ళ బంధువు కృష్ణ అనే రైతు దస్తగిరి కుటుంబ సభ్యులకు అందజేసినట్టు మాకు సమాచారం వచ్చింది.రైతు దస్తగిరి(బుజ్జి) మృతి కి మార్కెట్ లావాదేవీలకు సంబంధం లేదు.ఆ రైతు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మాకు ఈ రోజే తెలిసింది,’’ అని మార్కెట్ యార్డ్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి అనంతయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

 

తమిళనాడు రోడ్డు ప్రమాదం, అయిదుగురు గుంటూరు జిల్లా వాసులు మృతి

చెన్నై: తిరునల్వేలి దగ్గర ఘోరా   రోడ్డు  ప్రమాదం , గుంటూరు జిల్లాకు చెందిన అయిదుగురు మృతి. తిరునల్వేలి నుంచి వీరు ఒక బస్సులో కన్యాకుమారి వెళ్తున్నారు. దారిలో  ఆగిఉన్న బస్సు ఒక  సిమెంట్ లారీ ఢీకొనడంతో ప్రమాదం  ప్రయాణిస్తున్న జరిగింది.  మరణించిన వారంతాా గుంటూరు ఈపూరు లంకకు చెందిన వారు. సహాయక చర్యల కోసం ఆంధ్రఅధికారులు తమిళనాడుఅధికారులతో సంప్రదించాలని ముఖ్యమంత్రి అదేశించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ తమిళనాడు అధికారులతో సంప్రదింపులు జరుగుపుతున్నారు.కొల్లూరు తాహశీల్దార్ ను తిరునల్వేలి పంపించారు.  కలెక్టర్ కోనశశిధర్ తిరునల్వేలి కలెక్టర్ తో  సంప్రదించి మృతదేహాలను గుంటూరు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

తమిళనాడు రోడ్డు ప్రమాదంపై తాజా సమాచారం (మధ్యాహ్నం ఒంటిగంటకు)

తిరునల్వేలి,పాళ్యం కోట్టై  పాలిటెక్నిక్ కాలేజీదగ్గిర తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.  మొత్తం 12 మంది ప్రయాణికుల కావేరీ పుష్కరాలుచూసుకుని కన్యాకుమారి వెళ్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో అయిదుగురు చనిపోయారు. వారి పేర్లు.

కె. రత్నమాణిక్యం(63)

జి.  నాగవర్ధిని (45)

డి. వెంకటరమణ(65)

రామకోఠి( 65)

సత్యం (65)

మిగతా ఏడుగురికి చిన్నచిన్న గాయాలయ్యాయి వారికి స్థానికి జిల్లా ఆసుపత్రిల్ చికిత్సచేశారు.

 

 

 

గుత్తిలో దొంగల దాడి, ఇంటి  యజమాని హత్య, దోపిడి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణం కుమ్మరి వీధిలో శనివారం తెల్లవారుజామున దొంగలు పడ్డారు. ఒక ఇంటిలోకి ప్రవేశించి ఇంటి యాజమాని సుధాకర్ ను హత్య చేసి రూ.5 లక్షలు, 25 తులాల బంగారం అపహరించుకపోయారు. సుధాకర్ ను  రాడ్ల తో కొట్టి చంపేశారు. దొంగల దాడిపై సుధాకర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సుధాకర్ మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనితో ఎపుడు ప్రశాంతంగా ఉండే గుత్తి పట్టణంలో ఈ సంఘటనంతో ఉలిక్కి పడింది. ఉరంతా ఇదే చర్చ.

యువజన కాంగ్రెస్ నేత హత్య

తెలంగాణా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలో యువజన కాంగ్రెస్‌ నేత వేముల శ్రీనివాస్‌(వాసు)(40)ను హత్య చేశారు.  శుక్రవారం రాత్రి  ప్రత్యర్థులు ఆయన మీద దాడి దారుణ హత్యచేశారని కుటుంబ సభ్యులు చెప్పారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని కొంతమంది  శ్రీనివాస్‌ను హత్య చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !