ఈ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడో చూస్తే గర్వపడతారు (వీడియో)

Published : Sep 15, 2017, 02:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఈ హెడ్ కానిస్టేబుల్ ఏం చేశాడో చూస్తే  గర్వపడతారు (వీడియో)

సారాంశం

ఖాకి వేసుకుంటే మనిషి కఠినాత్ముడయిపోతాడని అంతా అనుకుంటారు అయితే, ఆయనలో ఖాకీ మానవత్వాన్ని రెట్టింపు చేసింది

 

 

 

అనగనగా ఒక ఊరు. పేరు మొగల్తూరు. జిల్లా పశ్చిమ గోదావరి. ఆ ఊర్లో ఒక హెడ్ కానిస్టేబుల్. నెంబర్  హెచ్ సి 1788.  ఖాకి వేసుకుంటే, మనిషి కఠినాత్ముడయిపోతాడని అంతా అనుకుంటారు. అది చాలా మటుకు నిజం.అందుకే ఖాకివనం లాంటి పోలీసు స్టేషన్ లోకి వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడరు. అయితే, నెంబర్ 1788 నిలువెత్తు మానవత్వం. ఖాకి ఆయన స్వభావాన్ని మార్చలేక  పోయింది. సరికదా,  ఆయనలో మానవత్వాన్ని రెట్టింపు చేసింది. అందువల్ల ఇపుడు ఆయన్ని నెంబర్ తో కాకుండా చక్కగా  పేరు తో పిలవాలి. గౌరవించాలిన అపుడు ఈ నెంబర్ గంట వెంకట వర్మ అవుతుంది. ఆయనేం చేశాడో తెలుసా!!!

పెదమైనవాని లంక గ్రామానికి చెందిన మెర్సీ (9866439609) అనే 5సంవత్సరాల బాలుడి పొట్ట మీది నుంచి  ఆ మధ్య మోటార్ సైకిల్ వెళ్ళింది. దీనితో  మెర్సీ పొట్ట భాగం నలిగి పోయి నొప్పితో ఇంకా బాధపడ్తున్నాడు. తండ్రి దగ్గిర  వైద్యం కోసం డబ్బులేదు. దానితో  ఇంటివద్దనే వుంటూ బాధపడుతూ, ఎపుడో ఒక సారి నయం కాకపోదా అనుకుని బాధ దిగమింగుతూ బతుకుతున్నాడు. మన  హెడ్ కానిస్టేబుల్ గంట వెంకట వర్మ చెవిన ఈ వార్త పడింది.

అంతే, అతనిలోని మనిషి పెల్లుబికి వచ్చాడు.  ఆ బాలుడి కి రూ. 10,000  డబ్బు సహాయం చేసి ఆదుకున్నాడు.  గతంలకూడా వర్మ ఇలా చాలా సార్లు చేశాడట.  ఇటీవల గుంటూరు కు చెందిన కావ్య అనే ఆమెకు కాళ్ళు చేతులు చచ్చు పడడంతో వర్మ చలించాడు. కుటుంబ సభ్యుల సహకారం తో లక్ష రుపాయల డబ్బును అందించి అదుకున్నాడు. వర్మ ఇపుడు ఈ ప్రాంతంలో మారు మోగుతున్నపేరు.
మెర్సీ సమస్య పదివేల తీరదు. అందువల్ల  (తిరుమాని సాంబమూర్తి- బాలుని తాత ఫోన్: 9866439609) అనే బాలుడి ని ఆదుకోమని గంట వెంకట వర్మ మనసున్న వారిని  కోరుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !