అరుణ్ జైట్లీ పెద్ద జోక్ పేల్చారు..!

First Published Oct 25, 2017, 6:10 PM IST
Highlights
  • కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా ముఖంగా పెద్ద జోక్ పేల్చారు. 
  • నవంబర్ 8వ తేదీన దేశ వ్యాప్తంగా నల్లధన వ్యతిరేక దినం నిర్వహించనున్నట్లు చెప్పారు.
  • అసలు దేశంలో నల్ల డబ్బే లేనప్పుడు మళ్లీ దానికి ప్రత్యేకంగా దినం ఎక్కడి నుంచి వచ్చింది?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా ముఖంగా పెద్ద జోక్ పేల్చారు.  నవంబర్ 8వ తేదీన దేశ వ్యాప్తంగా నల్లధన వ్యతిరేక దినం నిర్వహించనున్నట్లు చెప్పారు. అసలు దేశంలో నల్ల డబ్బే లేనప్పుడు మళ్లీ దానికి ప్రత్యేకంగా దినం ఎక్కడి నుంచి వచ్చింది?

గతేడాది పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దేశంలోని బ్లాక్ మనీని బయటకు రప్పించేందుకు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు  పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని అప్పుడు ప్రధాని మోదీ చెప్పారు.  అలా రద్దు చేసి నవంబర్ 8 నాటికి సంవత్సరం గడుస్తుంది. అందుకని ఈ నల్లధన వ్యతిరేక దినం చేయాలని వారు భావిస్తున్నారు.

అయితే.. ఆ నోట్ల రద్దు ప్రకటించే నాటికి దేశంలో 15లక్షల 60వేల కోట్లు చలామణిలో ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నూతన నోట్లను కూడా ప్రవేశపెట్టారు. రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అందుకు కొంత సమయం  కూడా కేటాయించింది. ఆ గడువులోపు ప్రజలందరూ తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకున్నారు. కాగా.. నోట్ల రద్దు రోజు ఎంత మొత్తం చలామణిలో ఉందని ప్రభుత్వం చెప్పిందో.. దాదాపు అంత మొత్తం బ్యాంకులకు వచ్చి చేరినట్లు ఇటీవల రిజర్వు బ్యాంకు తెలిపింది.

అంటే.. నల్లధనం లేనట్లే కదా..  ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పుడు  దేశంలో ఉన్నదంతా తెల్ల ధనమే. మరి అలాంటప్పుడు ఈ ‘నల్లధన వ్యతిరేక దినం’ ప్రభుత్వం ఎందుకు చేస్తున్నట్లు..?

click me!