శ్రీశైలంలో రేవంత్ రెడ్డి

Published : Oct 25, 2017, 04:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
శ్రీశైలంలో రేవంత్ రెడ్డి

సారాంశం

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రేవంత్ రేవంత్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికన అర్చకులు

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వచ్చారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం వారికి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో పాటు  తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

ఇదిలా ఉండగా.. ఉభయ రాష్ట్రాల టీడీపీలో చిచ్చుపెట్టిన రేవంత్.. తన కుటుంబసభ్యులతో ప్రశాంతంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ చేసిన విమర్శలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రేవంత్ ని  పార్టీ నుంచి బహిష్కరించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి రాగానే పార్టీలో ఆయన భవిష్యత్తు తెలియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మనశ్శాంతి కోసం ఆలయానికి వెళ్లారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !