
"ఇండియన్ ఫ్యాన్స్ లా చెత్త పనులు చేయవద్దు" అంటు లంక క్రికెట్ అభిమానులకు హితువు పలికాడు శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ. మూడవ వన్డేలో లంక ఓటమి తట్టుకోలేక ఫ్యాన్స్ స్టేడియంలో నానారభస చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల గొడవ కారణంగా గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకోని రణతుంగ అభిమానులపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు, అంత వరకు బాగానే ఉంది కానీ మన ఇండియన్స్ ని పోల్చుతూ ఆయన ఫ్యాన్స్ ను తిట్టాడు.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.
గతంలో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో అభిమానుల ఆగ్రహాన్ని ప్రస్తావించిన ఆయన, ఇండియన్ ఫ్యాన్స్ లా చెత్త పనులు చేయవద్దని, శ్రీలంకకు మంచి చరిత్ర, సంప్రదాయం ఉందని అన్నారు. దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగరాదని, మ్యాచ్ ఓడిపోవడం బాధాకరమే అయినా, ఆగ్రహాన్ని ప్రదర్శించరాదని, ఒకసారి ఇలాంటి దురదృష్టకర ఘటన జరిగితే, అది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
రణతుంగ ఈ వ్యాఖ్యలు చేయడంపై పలువురు భారత క్రీడాభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన పై భారత అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. "ఓటమిని తట్టుకోలేక నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు" అంటు పలు రకాల కామెంట్లతో రణతుంగ పై ఇండియన్లు ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే... 2011 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి సందర్భంగా ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందని అర్జున్ రణతుంగ కామెంట్ చేశాడు, ఇప్పుడు మరోసారి ఇండియన్ ఫ్యాన్స్‌ను కవ్వింపుకు దిగాడు.
మరిన్ని నూతన విశేషాల కోసం కింద క్లిక్ చేయండి