
అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ లో కొంచెం కూడా మార్పు రాలేదన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఇప్పుడు మళ్లీ పాదయాత్రలో అదేవిధంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తోందని తెలిపారు. జగన్ అవినీతి గురించి మొన్నటి వరకు జాతీయస్థాయి వరకే తెలుసని, తాజాగా ప్యారడైజ్ పేపర్ల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆయన అవినీతి చరిత్రకెక్కిందని వ్యాఖ్యానించారు. బెంగళూరులో 29 ఎకరాల్లో భారీ భవంతిని నిర్మించుకున్న జగన్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.