
జగన్ అహంకారి అన్న విషయం అతని ప్రవర్తన చూస్తేనే అర్థమౌతుందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరి పేటలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ విషపూరితమైన పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా.. ప్రజలు ఆయన్ని క్షమించరన్నారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాతైనా జగన్ ధోరణిలో మార్పురాకపోవడం బాధాకరమన్నారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేది ఒక్క టీడీపీ ప్రభుత్వమేనన్నారు