వైసీపీ నేతపై ఉమా అనుచరుల దాడి

Published : Nov 05, 2017, 04:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
వైసీపీ నేతపై ఉమా అనుచరుల దాడి

సారాంశం

కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు దౌర్జన్యం వైసీపీ నేతపై దాడికి పాల్పడ్డ మంత్రి ఉమా అనుచరులు

కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైసీపీ నేతపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన జి. కొండూరు మండలం గంగినేని పాలెంలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. వైసీపీ అధినేత జగన్.. సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ..వైసీపీ నేత భూక్యా కృష్ణ ఆలయంలో పూజలు చేశారు.

జగన్ కోసం  పూజలు చేయడం చూసి సహించలేని మంత్రి దేవినేని ఉమా అనుచరులు.. భూక్యాపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వైసీపీ నేత కి తీవ్రగాయాలయ్యాయి.  ప్రస్తుతం భూక్యా.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !