గాలికి రోజా సవాల్

Published : Nov 05, 2017, 03:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
గాలికి రోజా సవాల్

సారాంశం

గాలి ముద్దుకృష్ణమ నాయుడికి సవాల్ విసిరిన రోజా 35 ఏళ్లుగా నగరి అభివృద్ధికి చేసిన కృషి ఏంటో చెప్పమని అడిగిన రోజా

ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడికి .. వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. ఆదివారం ఆమె వడమాలపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. నగరి నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచిందంటూ ముద్దు కృష్ణమ నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గంలో సీఎం సహాయనిధి నుంచి 700మందికి ఆర్థిక సహాయం ఇప్పించానని గాలి చెప్పుకుంటున్నారని రోజా చెప్పారు. అయితే.. అందులో సగం మంది కూడా అర్హులు లేరని విమర్శించారు. దీనిపై తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. నిరూపిస్తే.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాలు విసిరారు.

నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో బాధపడున్నారని చెప్పారు. 35 ఏళ్లుగా ఆయన నగరి నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో తాను నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని తెలిపారు. అయితే.. అభివృద్ధి జరగనీయకుండా అధికార ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !