లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సిబిఐ దాడులు

First Published Jul 7, 2017, 11:48 AM IST
Highlights

ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యుల నివాసాల మీద  సిబిఐ దాడులు చేసింది.  పట్నాతో సహా  12 ప్రాంతాల్లో ఏక కాలంలో సిబిఐ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడులు ఉదయం 5.30 కు మొదలయ్యాయి.

ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యుల నివాసాల మీద  సిబిఐ దాడులు చేసింది.

 పట్నాతో సహా  12 ప్రాంతాల్లో ఏక కాలంలో సిబిఐ దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడులు ఉదయం 5.30 కు మొదలయ్యాయి. లాలూతో పాటు  భార్య రబ్రీదేవి, కుమారుడు, ఇపుడు మంత్రి అయిన  తేజస్వి మీద పై సిబిఐ  అవినీతి కేసు నమోదు చేసింది. 2006లో రైల్వే మంత్రిగా ఉన్నపుడు అక్రమంగా  ప్రైవేట్ సంస్థ రెండు హోటళ్లు నడిపేందుకు లీజుకు సహకరించారన్నది ఆరోపణ. దీనికి బదులుగా పట్నాలో ఆయనకు రెండెకరాల భూమి లభించింది. ఇందులో ఇపుడు మాల్ కడుతున్నారు.రాంచి, పూరిలలో ఉన్న రెండు హెరిటేజ్ హోటళ్లను రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సిటిసి)తీసుకుంది. వీటిని నిర్వహణకు సంబంధించి టెండర్లను పిలించి, సుజాత్ హోటల్స్ కు అప్పగించారు. ఇందులోనే లాలూ పట్నా లో భూమి తీజుకుని లీజ్ ను ఈ ప్రయివేటు సంస్థలకు అప్పగించారని సిబిఐ అంటున్నది. ఈ మేరకు కేసు బుక్ చేశారు.

 

ఆర్ జెడి ఇపుడు ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో భాగస్వామి.  ఆయన ఇద్దరు కొడుకులు ఇందులో మంత్రులు కూడా. సిబిఐ ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్   భార్య రబ్డీ పేరుకూడా చేర్చారు.

 ఈ లీజు వ్యవహారంలోనే రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఎండి పికె గోయల్ ను సిబిఐ అదుపులోకి తీసుకుంది.

click me!