ప్రారంభోత్సవాలే.. ప్రారంభోత్సవాలు..

Published : Oct 30, 2017, 05:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ప్రారంభోత్సవాలే.. ప్రారంభోత్సవాలు..

సారాంశం

జలవనరుల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం రాష్ట్రంలో 10 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తైందన్న చంద్రబాబు త్వరలోనే వాటిని ప్రారంభిస్తామన్న చంద్రబాబు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తయిన ప్రాజెక్టులను చంద్రబాబు త్వరలో ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నిర్వహించనున్నారు. వరుసగా మూడు రోజుల పాటు  ఈ 10 ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.  సోమవారం జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ కార్యక్రమం షెడ్యూల్ అయ్యింది.

డిసెంబర్‌లోగా పూర్తిచేయాల్సిన 28 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలకు సిద్ధమని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. కోగుళ్లు, ఎర్ర కాల్వ, కండలేరు లిఫ్టు, మారాల, చెర్లోపల్లి, సిద్ధాపురం, నర్సింహరాయ సాగర్‌, గోరకల్లు, అవుకు టన్నెల్‌, పెదపాలెం (గుంటూరు), చిన్నసాన ప్రాజెక్టులు పూర్తి అయ్యాయయని తెలిపారు

పోలవరం, ఇతర ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు అధికారులతో చర్చించారు. సకాలంలో పనులు పూర్తి చేస్తున్న ఎల్అండ్ టీ, బావర్ సంస్థలను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టరు విషయంలో చట్ట ప్రకారమే వెళ్లాలని భావిస్తున్నామని, 60సీ నిబంధనను అనుసరించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. దీనిపై మంత్రిమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !