కవితను టీడీపీ నుంచి గెంటేస్తున్నారా?

Published : Oct 30, 2017, 03:34 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
కవితను టీడీపీ నుంచి గెంటేస్తున్నారా?

సారాంశం

టీడీపీని వీడుతున్న సినీ నటి కవిత పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన కవిత

అంతా అనుకున్నదే జరిగింది. ఎప్పుడో ఒకప్పుడు టీడీపీ నుంచి కవితను గెంటేస్తారని అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే విషయం కవిత చాలా సార్లు.. చాలా మంది దగ్గర ప్రస్తావించారు. ఇప్పుడు   అది నిజమైంది.

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కవిత  మీడియాతో మాట్లాడారు. తాను వచ్చే వారం టీడీపీ ని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.

‘‘పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదని, భజనలు చేసే వారికే  పార్టీలో కీలక పదవులు దక్కుతున్నాయని’’ ఆమె ఆరోపించారు. తాను పార్టీ కోసం ఎంతో కృషి చేసినప్పటికీ తనకు సరైన పదవులు దక్కలేదని వాపోయారు.  కొందరు పార్టీ నేతలు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని, మెడ పట్టుకొని బయటకు గెంటినంత పని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు ఏమీ మాట్లడలేదని   అందుకే పార్టీ నుంచి బయటకు రావాలని నిశ్చయించుకున్నట్లు కవిత వెల్లడించారు. ఇలాంటి వ్యాఖ్యలే ఇటీవల సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఒక వేధికపై ప్రస్తావించడం గమనార్హం.

టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత.. బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !