
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బీఎస్ 3 ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ 1 నుంచి భారత్ లో అమ్మడం నిషిద్ధం. దీంతో బైక్ కంపెనీలన్నీ తమ దగ్గర ఉన్న వాహనాలన్నీ ఏదో ఒక ధరకు భారత్ మార్కెట్ లోనే అమ్మడానికి సిద్ధమయ్యాయి.
ఏప్రిల్ 1 లోపే అమ్మకాలన్నీ చేయడాలనే సంకల్పంతో అన్ని బైక్ కంపెనీలు ధరలపై భారీ డిస్కౌంట్ లు ప్రకటించాయి.
గరిష్టంగా రూ. 22 వేల నుంచి కనిష్టంగా రూ. 8 వేల వరకు వివిధ బైక్ కంపెనీలు తమ వాహనాల ధరలు తగ్గించాయి.
ఈ రోజులోపే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. ఈ విషయం తెలియడంతో వినియోగదారులు వివిధ బైక్ షోరూంల వద్దకు పరుగులు తీస్తున్నారు. కానీ, ఇదే అదునుగా షోరూం యజమానులు, బైక్ డీలర్లు కొత్త మోసానికి తెరతీశారు.
షోరూం వద్ద బీఎస్ 3 వాహనాలను అమ్ముడైపోయాయని బోర్డు పెట్టి ఆ వాహనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.
మార్చి 31 తేదీతో ఇన్ వాయిస్ లు తయారు చేసురూని, తమ వద్ద ఉన్న వాహనాల వివరాలను రాసేసి, వాటిని అమ్ముకున్నట్టు రికార్డులలో చూపిస్తున్నారు.
ఆ తర్వాత వీటిని అసలు ధరలకు కస్టమర్లకు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నారు.
మార్చి 31 బైక్ కొన్నట్లు ఇన్ వాయిస్ ఉన్న అలాంటి బైక్ లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. అందుకే డీలర్లు ఈ డిస్కౌంట్ ఆఫర్ లను వినియోగదారులకు చేరకుండా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.