నోయిడాలో ఇండియన్ క్రికెటర్ పై దాడి

Published : Jul 22, 2017, 02:48 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నోయిడాలో  ఇండియన్ క్రికెటర్ పై దాడి

సారాంశం

పర్వీందర్ కారు కూడా ధ్వంసం నిందితులు గంగోలా గ్రామానికి చెందినవారుగా గుర్తింపు విచారణ కొనసాగుతుందన్న పోలీసులు

ఇండియన్ క్రికెటర్ పర్వీందర్ అవానపై గత రాత్రి  గ్రేటర్‌ నోయిడాలో  గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.  

అతని వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు.  వివరాల్లోకి వెళితే..  గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు గత రాత్రి  

ఓ ఐస్‌ ఫ్యాక్టరీ వద్ద కొంతమందితో గొడవపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓ కారు వారిని దాటుకుంటూ

వెళ్లింది. ఐతే ఆ కారు తమతో గొడవపడిన వారిదిగా  భావించిన యువకులు దాన్ని అడ్డుకుని కారులో ఉన్న పర్వీందర్‌పై

దాడికి దిగారు. అనంతరం అతని కారును ధ్వంసం చేసి అక్కడ నుంచి  పరారయ్యారు. దీంతో పర్వీందర్‌ స్థానిక పోలీసులకు

ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన వారు గ్రేటర్‌ నోయిడాలోని గంగోలా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పర్వీందర్‌ భారత్‌ తరఫున 2012లో ఇంగ్లాండ్‌పై రెండు టీ20లు ఆడాడు.

ఐపీఎల్‌లో అతను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !